Tanveer Ahmed On IND VS AFG:
టీమిండియా వర్సెస్ ఆఫ్గనిస్తాన్ మధ్య నిన్నటి వరకు మూడు టి20 ల సిరీస్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ టి20 సిరీస్ నేపథ్యంలో ఆడిన మూడింటిలో టీమిండియా అద్భుతమైన విక్టరీ అందుకుంది. ఈ క్రమంలో టీమిండియా చేతిలో 3-0 వైట్ వాష్ అయింది ఆఫ్గనిస్తాన్. ఇక శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో గెలుచుకున్న రెండో సిరీస్ ఇదే కావడం గమనార్హం.
ఆఫ్ఘనిస్తాన్ జట్టు పైన సిరీస్ గెలిచిన టీమిండియా జట్టుపై అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తుంటే… పాకిస్తాన్ మాజీలు మాత్రం రెచ్చిపోతున్నారు. అసలు ఆఫ్గనిస్తాన్ పై విజయం సాధించడం పెద్ద గొప్ప కాదని విమర్శలు చేస్తున్నారు. ఇందులోను ముఖ్యంగా పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ రెచ్చిపోయి మాట్లాడారు. బలహీనమైన ఆఫ్ఘనిస్తాన్ జట్టును చిత్తుచేసి… టీమిండియా క్రికెటర్లు హీరోలు అయినట్టుగా బిల్డప్ ఇస్తున్నారని చురకలు అంటించారు. ఇంగ్లాండ్ గడ్డపై తోకముడిచిన టీమిండియా జట్టు…. సొంత గడ్డపై అందులోనూ బలహీనమైన ఆఫ్ఘనిస్తాన్ పైన గెలవడం పెద్ద రేంజ్ లాగా ఫీలవుతుందని మండిపడ్డారు. అసలు ఆఫ్ఘనిస్తాన్ పై విజయం సాధించడం పెద్ద గొప్పేం కాదని శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ ని హేళన చేస్తూ మాట్లాడారు.
టీమిండియా కు ఫ్లాట్ మైదానాలపై విజయం సాధించడం అలవాటేనని పరువు తీశారు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్. ఇండియాలో ఏర్పాటు చేసిన అన్ని… ఫ్లాట్ పిచ్ లే అంటూ పరువు తీశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో కూడా ఇలాంటి ఫ్లాట్ మైదానాలలో ఆడి టీమిండియా క్రికెటర్లు రెచ్చిపోయి ఆడుతూ ఉంటారని బాంబు పేల్చారు. ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరిగిన అరుణ్ జైట్లీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కూడా ఫ్లాట్ మైదానం కిందికే వస్తుందని వెల్లడించారు. అందుకే ఎప్పుడు ఫామ్ లో లేని సంజు.. ఇరగదీసాడని హేళన చేశారు. అటు 30 బాల్స్ లోనే అభిషేక్ శర్మ సెంచరీ చేసి.. బిల్డప్ ఇస్తున్నాడని ఫైర్ అయ్యారు. దమ్ముంటే పాకిస్తాన్ జట్టుపై ఆడి తన ప్రతాపం ఏంటో చూపించాలని సవాల్ విసిరారు తన్వీర్ అహ్మద్. ఈ క్రమంలో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.
ఆఫ్ఘానిస్తాన్ పై మూడు టీ20ల సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకుంది. ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్ చేసిన ఓ మంచి పని వైరల్ గా మారింది. ట్రోఫీ అందుకునే క్రమంలో ఆఫ్ఘానిస్తాన్ కెప్టెన్ ఇబ్రహీం జర్దాన్ ను కూడా పిలిచారు. దీంతో ఇద్దరూ కెప్టెన్లు కలిసి, ట్రోఫీని అందుకున్నారు. ఈ సంఘటనపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తూంటే, షాహిద్ అఫ్రిది మాత్రం విమర్శించారు. పాకిస్తాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడం చేతకాదు కానీ, ఆఫ్ఘానిస్తాన్ క్రికెటర్లతో రాసుకుని, పూసుకుని తిరుగుతున్నారని ఫైర్ అయ్యారు. ఓడిపోయిన తర్వాత కూడా విజయోత్సవాలలో ఆఫ్ఘానిస్తాన్ కెప్టెన్ పాల్గొనడం సిగ్గు చేటు అంటూ సీరియస్ అయ్యారు.