E-Paper
Advertisement

పుట్టుకతో భూములుంటే ఎన్నికల అఫిడవిట్‌లో ఎందుకు లేదు.. కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి సూటి ప్రశ్న

పుట్టుకతో భూములుంటే ఎన్నికల అఫిడవిట్‌లో ఎందుకు లేదు.. కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి సూటి ప్రశ్న
Advertisement

Land Grabbing: తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ భూముల వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది. ఈ విషయంలో కౌంటర్ ఇవ్వబోయి కేసీఆర్ కుటుంబ సభ్యులు అడ్డంగా దొరికిపోతున్నారు. భూములు లేవని ఒకసారి.. పుట్టుకతో భూములు ఉన్నాయని చెప్పడంతో అధికార కాంగ్రెస్ పార్టీ ముప్పేట దాడి తీవ్రతరం చేసింది. ఈ క్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చిట్ చాట్‌లో కీలక విషయాలు బయటపెట్టారు.

కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో రెండో రోజు అధికారులు సర్వేలు

తెలంగాణలో రాజకీయాలు భూముల కబ్జా చుట్టూ తిరుగుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ఫ్యామిలీ భూముల వివరాలు బయటపెట్టడం, దీనిపై అధికారులు విచారణ చేపట్టడం చకచకా జరిగింది. ఈ వ్యవహారంలో కొంప కొల్లేరు అవుతుందని భావించారు కేసీఆర్ కుటుంబసభ్యులు. కౌంటర్లు ఇవ్వబోయి అడ్డంగా బుక్కైపోతున్నారు. ఎర్రవల్లిలో మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్‌లో రెండో రోజు భూములపై సర్వే చేస్తున్నారు అధికారులు. ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ AD సుదర్శన్ ఆధ్వర్యంలో ఈ సర్వే జరుగుతోంది. 325 సర్వే నెంబర్ సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. ఎర్రవల్లి, శివారు వెంకటాపూర్ గ్రామాల్లో విల్లెజ్ బౌండరీస్ గుర్తిస్తున్నారు. మొత్తం ఐదు బృందలుగా విడిపోయిన అధికారులు సర్వే చేస్తున్నారు. ప్రస్తుతం 325 సర్వే నంబర్‌లో సర్వే చేస్తున్నామని చెబుతున్నారు.

కేటీఆర్ గుట్టు బయటపెట్టిన మంత్రి పొంగులేటి

Advertisement

కేసీఆర్ పుట్టుకతోనే భూస్వాములను కేటీఆర్ మీడియా ముందు చెప్పడంతో అధికార పార్టీ నేతలు రియాక్ట్ అయ్యారు. శుక్రవారం మీడియా చిట్‌చాట్‌లో కీలక విషయాలు ప్రస్తావించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గోల్డెన్ స్పూన్‌తో పుట్టామని చెబుతున్న మీరు, ఎలక్షన్ ఆఫిడవిట్‌లో ఆ వివరాలు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఇప్పుడు ఆ వివరాలు ఎలా బయటకు వచ్చాయి? ఇది కక్ష, కుట్ర కానే కాదన్నారు. అధికారం అడ్డుపెట్టు కొని దోచుకున్నారని ఆరోపించారు. అధికారంలో లేనప్పుడు ఎంత ఉంది? గడిచిన పదేళ్లలో సంపాదించినది ఏంత? లక్షల కోట్లకు అధిపతులు ఎలా అయ్యారు? బినామీల పేర్ల మీద ఎంతవుంది?

ఎందుకు ఎన్నికల అఫిడవిట్‌లో ప్రస్తావించలేదు-మంత్రి

రంగనాయక్ సాగర్ దగ్గర కనీసం వాష్ రూమ్ వెళ్లడానికి చోటు లేదని చెబుతున్న మీరు, అక్కడ అన్ని ఎకరాలు ఎలా వచ్చిందంటూ ప్రశ్నలు రైజ్ చేశారు. అసైన్డ్ భూములకు పట్టాలు పొందినవారిని అధికారులు ఇబ్బంది పెడితే వారిపై చర్యలు చర్యలు తీసుకుంటామన్నారు. కేసీఆర్ ఫార్మ్‌హౌస్ వద్ద రైతులు, స్థానికులతో కావాలని మాట్లాడిస్తున్నారని అన్నారు. వెంకటారపురం, ఎర్రవల్లి ప్రాంతాల మధ్య ఓవర్ లాప్ భూమి ఉందని, వాటిపై లెక్క తేలాల్సి ఉందన్నారు. అసైన్డ్‌మెంట్ భూమి ఉండాల్సినంత లేదని, బినామీ పేర్లతో బదిలీ జరిగిందని మనసులోని మాట బయపెట్టారు.

Advertisement

ALSO READ: భారీ కొండచిలువతో ప్రజలు బెంబేలు.. హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో, వీడియో వైరల్

ఓవర్ లాప్ భూముల చుట్టూ కేసీఆర్ తిష్ఠ వేశారని, చట్టబద్ధంగా ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. సర్వే చేసి ఎక్కువ తక్కువ ఉంటే కేసీఆర్‌కు నోటీసులు ఇస్తామన్నారు. అసలు ఒరిజినల్ జమిందార్ అయితే 2004 ఎన్నికల అఫిడవిట్‌లో కేసీఆర్ ఎందుకు ప్రస్తావించలేదు? కేవలం ఒక్క ఎకరం ఉందని చూపించారని, ఒరిజినల్ పట్టా ఉన్నదాంట్లో బయటవారు ఉన్నారా? వేరే వాళ్ళు ఉన్నారా? అనేది ఇంకా తెలియాల్సివుందన్నారు. ఎలక్షన్ అఫిడవిట్‌లో ఏమి పెట్టారు? ఉన్నది ఎంత? దళితులకు, గిరిజనులకు సంఘీభావం చెప్పడానికి ఎంపీలు, ఎమ్మెల్సీలు అక్కడి వెళ్తారన్నారు.

 

Related News

కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్.. మాకు వెయ్యి కోట్లు ఇస్తే మొత్తం మీకే!

భారీ కొండచిలువతో ప్రజలు బెంబేలు.. హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో, వీడియో వైరల్

యూట్యూబర్‌ వైష్ణవి భర్త హత్యలో కొత్త ట్విస్ట్‌.. హ‌రిబాబును నేనే చంపేశా, ఎలా ప్లాన్ చేశానంటే

కేసీఆర్, సీఎం రేవంత్ ఆస్తులపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా? – కేటీఆర్

సీఎం రేవంత్‌ రెడ్డిపై రెడ్ బుక్ రాస్తున్నాం.. ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు!

ఫ్యూచర్ సిటీలో ఎడ్యుకేషన్ హబ్.. యూకే వర్సిటీల ప్రతినిధులతో సీఎం రేవంత్ కీలక భేటీ

బాంబ్ పేల్చిన విప్ ఆది శ్రీనివాస్.. కేటీఆర్ 7289 డాక్యుమెంట్ సీక్రెట్ ఇదేనా?!

Big Stories

Advertisement
×