KTR Challenge: తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ- విపక్ష బీఆర్ఎస్ మధ్య రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఓ వైపు కేసీఆర్ ఫ్యామిలీ భూములపై సర్వే జరుగుతోంది. మరోవైపు కేటీఆర్.. రేవంత్ ప్రభుత్వానికి ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నారు. మాకు వెయ్యి కోట్లు ఇస్తే.. మొత్తమంతా మీకే ఇస్తామని చెప్పడం శుక్రవారం న్యూస్‌లో మేజర్ హైలైట్.
అధికార కాంగ్రెస్ పార్టీ- విపక్ష బీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఓ వైపు కేసీఆర్ ఫ్యామిలీ భూములపై సర్వే జరుగుతోంది. ఆ విషయాన్ని డైవర్ట్ చేసేందుకు కొత్త పల్లవి తెరపైకి తెచ్చారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ క్రమంలో రేవంత్ సర్కార్‌కు ఆయన ఓపెన్ ఛాలెంట్ విసిరారు. కేసీఆర్ ఫ్యామిలీ లక్ష కోట్లు కొల్లగొట్టిందని సీఎం రేవంత్ ఆరోపిస్తున్నారని, ఆయనకు మేం ఆఫర్ ఇస్తున్నామని అన్నారు. మాకు వెయ్యి కోట్లు ఇచ్చాలని, మొత్తం మీకే ఇచ్చేస్తామని వ్యాఖ్యానించారు.
తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ కోసం మేము ఫార్ములా ఈ రేసును హైదరాబాద్‌కు తీసుకొచ్చామని, ఇటీవల తమిళనాడు సీఎం విజయ్ మోటార్ రేస్ కోసం లండన్ వెళ్లిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు కేటీఆర్. నాంపల్లి ఏసీబీ కోర్టులో ఫార్ములా ఈ-రేస్ కేసుకు సంబంధించిన విచారణ ముగిచడంతో తదుపరి విచారణను అక్టోబర్ 30కు వాయిదా వేసింది న్యాయస్థానం. విచారణ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, న్యాయస్థానం ముందు హాజరయ్యారు. విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని, న్యాయస్థానం ఎప్పుడు పిలిచినా హాజరవుతానని వెల్లడించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ కుటుంబంపై సీఎం రేవంత్‌రెడ్డి విష ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.
లక్ష కోట్ల విలువైన భూములు కొల్లగొట్టారని ప్రభుత్వం ఆరోపిస్తోందని, రూ.1000 కోట్లు మాకు ఇవ్వండి చాలన్ననారు. మిగతా డబ్బుతో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చొచ్చన్నారు. మహిళలకు ఇస్తామన్న తులం బంగారం ఇవ్వవచ్చని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసిందని ఆరోపించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తోపాటు నేతలను ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎన్నికలలో ఇచ్చిన హామీల అమలు చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కేటీఆర్ సూచించారు.
ALSO READ: పుట్టుకతో భూములుంటే ఎన్నికల అఫిడవిట్‌లో ఎందుకు లేదు.. కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి సూటి ప్రశ్న
ఈ సందర్భంగా రైతులకు ఇచ్చిన రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా బోనస్ వంటి హామీల అమలపై పలు ప్రశ్నలు లేవనెత్తారు. విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. విద్యుత్ సరఫరా కోసం రైతులు సబ్‌స్టేషన్ల ఎదుటధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.