Dangbei X9 Ultra: చైనాలో డాంగ్‌బే కొత్త 4K లేజర్ ప్రొజెక్టర్ X9 Ultraని విడుదల చేసింది. హోమ్ థియేటర్‌తో పాటు గేమింగ్‌ను కూడా దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన ఈ ప్రొజెక్టర్‌లో ఎక్కువ బ్రైట్‌నెస్, లెన్స్‌ను సులభంగా సర్దుకునే సదుపాయం, తక్కువ ఇన్‌పుట్ ల్యాగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రస్తుతం చైనాలో JD.comలో దీని ధర మన భారత రూపాయల్లో సుమారు రూ.1,00,000 ఉంది.
X9 Ultraలో 0.47 అంగుళాల DMD చిప్‌తో పాటు QuaLas 42 RGB ట్రిపుల్ లేజర్ లైట్ సోర్స్‌ను వాడారు. ఇది 5,600 CVIA ల్యూమెన్స్, సుమారు 6,100 ISO ల్యూమెన్స్ బ్రైట్‌నెస్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. వేడి ఎక్కువ కాకుండా కొత్త కూలింగ్ సిస్టమ్ ఇచ్చారు. పెద్ద కూలింగ్ ఫిన్స్, మెరుగైన ఎయిర్‌ఫ్లో కారణంగా శబ్దం 28dB లోపే ఉంటుందని కంపెనీ చెబుతోంది.
ఈ ప్రొజెక్టర్‌లో నాలుగు వైపులా ఆప్టికల్ లెన్స్ షిఫ్ట్ ఉంది. దీంతో చిత్రాన్ని డిజిటల్ కీస్టోన్ వాడకుండా నిలువుగా 135 శాతం, అడ్డంగా 50 శాతం వరకు మార్చుకోవచ్చు. 1.2-1.5:1 ఆప్టికల్ జూమ్ కూడా ఉండటంతో ప్రొజెక్టర్‌ను కదపకుండానే స్క్రీన్ పరిమాణాన్ని మార్చుకోవచ్చు. తక్కువ రంగు వక్రీభవనం కోసం లో-డిస్పర్షన్ గ్లాస్ లెన్స్‌లను ఉపయోగించారు.
Also Read: వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌కు ఒకే సబ్‌స్క్రిప్షన్.. Meta One వచ్చేసింది!
Dolby Vision సపోర్ట్‌తో పాటు 80,000:1 డైనమిక్ కాంట్రాస్ట్, 100 శాతం DCI-P3 కలర్ గామట్‌కు సపోర్ట్ ఉంది. ఫ్యాక్టరీ నుంచే Delta E దాదాపు 0.7 వద్ద కలర్ కాలిబ్రేషన్ చేసినట్లు కంపెనీ తెలిపింది. DLP ప్రొజెక్టర్లలో కనిపించే రెయిన్‌బో ఎఫెక్ట్‌ను తగ్గించేందుకు సాఫ్ట్‌వేర్ కూడా ఇచ్చారు. ఇక గేమింగ్ విషయానికి వస్తే.. VRR, ALLM, 1ms ఇన్‌పుట్ ల్యాగ్, PC గేమింగ్ కోసం 21:9 అల్ట్రావైడ్ మోడ్ ఉన్నాయి.
MediaTek MT9681 ప్రాసెసర్, 3GB RAM, 64GB స్టోరేజ్‌తో X9 Ultra పనిచేస్తుంది. Wi-Fi 6, Dangbei AI OS 6.0, Mijia యాప్ సపోర్ట్ ఉన్నాయి. NAS నుంచి కంటెంట్ ప్లే చేసేందుకు NFS, SMB, FTP ప్రోటోకాల్స్‌కు సపోర్ట్ ఇస్తుంది. కనెక్టివిటీ కోసం రెండు HDMI 2.1 పోర్టులు, అందులో ఒకటి eARC, రెండు USB పోర్టులు, ఆప్టికల్ ఆడియో అవుట్‌పుట్ ఉన్నాయి. 12W ఫుల్‌రేంజ్ స్పీకర్లు రెండు, Dolby Audio, DTS సపోర్ట్ కూడా ఉన్నాయి.
మొత్తంగా చూస్తే.. పెద్ద స్క్రీన్‌పై సినిమాలు, స్పోర్ట్స్, గేమ్స్ చూడాలనుకునే వారికి అవసరమైన ఫీచర్లను ఒకే డివైస్‌లో అందించడమే ఈ మోడల్ లక్ష్యంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆప్టికల్ లెన్స్ షిఫ్ట్, ట్రిపుల్ లేజర్, 1ms ల్యాగ్ వంటి ఫీచర్లు దీన్ని సాధారణ హోమ్ ప్రొజెక్టర్ల కంటే భిన్నంగా నిలబెడుతున్నాయి. అయితే ప్రస్తుతం విడుదల చైనా మార్కెట్‌కే పరిమితంగా ఉంది. ఇతర దేశాల్లో దీని లభ్యత, ధరపై కంపెనీ ఇంకా వివరాలు ప్రకటించలేదు. భారత మార్కెట్‌లోకి వస్తే ధర కీలక అంశంగా మారొచ్చు.
Also Read: కొత్త ల్యాప్‌టాప్ కొనే ఆలోచనలో ఉన్నారా? Asus తెచ్చిన ఈ 5 మోడల్స్‌పై ఓ లుక్కేయండి!