E-Paper
Advertisement

Tanveer Ahmed: బెన్ డక్కెట్ లాగా అంద‌రూ ఐపీఎల్ ను బ‌హిష్క‌రించండి..బీసీసీఐని బొంద పెట్టండి

Tanveer Ahmed: బెన్ డక్కెట్ లాగా అంద‌రూ ఐపీఎల్ ను బ‌హిష్క‌రించండి..బీసీసీఐని బొంద పెట్టండి
Advertisement

Tanveer Ahmed:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ పై ( Indian Premier League 2026 Tournament ) పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు విషం కక్కుతున్నారు. ఐపీఎల్ టోర్నమెంట్ ను వదిలేసి, పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లోకి ( PSL ) రావాలని పదే పదే కామెంట్లు చేస్తున్నారు. అయితే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ల ప్రకటన నేపథ్యంలో చాలా మంది విదేశీ క్రికెటర్లు ఐపీఎల్ లోకి మాత్రమే వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఈ క్రమంలో తాజాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కు ఊహించని షాక్ ఇస్తూ ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ డక్కెట్ ( ben duckett) షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్నాడు. ఐపీఎల్ 2026 ఆడ‌బోనంటూ ప్ర‌క‌టించాడు. చివ‌రి క్ష‌ణంలో ఈ ప్ర‌క‌ట‌న చేసిన నేప‌థ్యంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ మ‌రో ప్లేయ‌ర్ ను గాలిస్తోంది. అయితే, చివ‌రి నిమిషంలో బెన్ డక్కెట్ ఐపీఎల్ కు గుడ్ బై చెప్ప‌డంపై పాకిస్తాన్ మాజీ క్రికెట‌ర్ త‌న్వీర్ అహ్మ‌ద్ ( Tanveer Ahmed) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బెన్ డక్కెట్ లాగా అంద‌రూ ఐపీఎల్ ను బ‌హిష్క‌రించండి.. బీసీసీఐని బొంద పెట్టండి అంటూ త‌న్వీర్ అహ్మ‌ద్ అంటూ బాంబ్ పేల్చారు.

Also Read: Shoaib Akhtar On PSL: అమ్మాయి-అబ్బాయి లేకుండా పెళ్లి చేస్తారా ? అభిమానుల‌ను నిషేధించ‌డంపై షోయ‌బ్ అక్త‌ర్ సీరియ‌స్

బెన్ డక్కెట్ లాగా అంద‌రూ ఐపీఎల్ ను బ‌హిష్క‌రించండి

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నుంచి చివరి క్షణంలో బెన్ డక్కెట్ తప్పుకున్నాడు. అయితే ఈ అంశంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బెన్ డక్కెట్ తరహా లోనే విదేశీ క్రికెటర్లందరూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ను బహిష్కరించాలని కోరారు. అప్పుడే భారత క్రికెట్ నియంత్రణ మండలికి బుద్ధి వస్తుందని షాకింగ్ కామెంట్స్ చేశారు. వరుసగా విదేశీ క్రికెటర్లు ఈ టోర్నమెంట్ ను బహిష్కరిస్తే, భారత క్రికెట్ నియంత్రణ మండలి రోడ్డున పడుతుందని కూడా విషం కట్టారు తన్వీర్ అహ్మద్.

ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ డక్కెట్ తాజాగా తీసుకున్న నిర్ణయం పట్ల ప్రశంసలు కురిపించారు. ఐపీఎల్ 2026 ను చివరి క్షణంలో వద్దనుకోవడం మంచి నిర్ణయం అని తెలిపారు. ఇప్పటికైనా పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లోకి బెన్ డక్కెట్ రావచ్చు అని తెలిపారు. అతని లాగే ఉద్దేశి క్రికెటర్లు అందరు పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లోకి రావాలని రిక్వెస్ట్ చేశారు తన్వీర్ అహ్మద్. దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇది ఇలా ఉండగా వ్యక్తిగత కారణాలు అలాగే అంతర్జాతీయ క్రికెట్ పై దృష్టి పెట్టేందుకు గాను ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ డక్కెట్ ఐపీఎల్ టోర్నమెంటును వదిలేసుకున్నాడు. అయితే బెన్ డక్కెట్ తీసుకున్న నిర్ణయం పైన బీసీసీఐ బ్యాన్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతనిపై మూడు సంవత్సరాల పాటు బ్యాన్‌ విధించేందుకు కసరత్తులు చేస్తోంది బీసీసీఐ.

Advertisement

Also Read: Suryakumar-chewing gums: ఒక్క రోజుకు 500 చూయింగ్ గ‌మ్స్..సూర్య కుమార్ కోసం బీసీసీఐ ఎన్ని ల‌క్ష‌లు ఖ‌ర్చు చేస్తోందంటే ?

 

https://www.facebook.com/photo/?fbid=122174499014784311&set=a.122099109440784311

Related News

ఉగ్రవాదుల టెన్షన్..21 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌లో అడుగుపెట్టిన ఇంగ్లాండ్

చిన్నస్వామిలో వర్షం పడాలని పోర్లు దండాలు పెట్టండి, లేకపోతే విండీస్ ఘోర ఓటమే!

విరాట్ కోహ్లీ నాలాగే ఉంటాడు కానీ, పెద్ద అంద‌గాడు కాదు !

వాళ్లంద‌రితో జై హిందూ అనిపించండి, ష‌మీ కామెంట్స్ వైర‌ల్ !

టీమిండియాకు ఏది చేత‌కాదు, ఇప్ప‌టికే విండీస్ సిరీస్ గెలిచింది, ట్రోఫీ ఇచ్చేయండి

టీమిండియా రూ.250 కోట్లు దొబ్బుకుపోతే, మాకు ఒక్క రూపాయి ఇవ్వ‌డం లేదు

నోటికి ప్లాస్ట‌ర్ వేసి, 15వ అంతస్తు నుంచి కిందకు వేలాడదీశారు!

విడాకులు త‌ర్వాత ప‌చ్చి తాగుబోతున‌య్యా..ధ‌న శ్రీపై యుజ్వేంద్ర చాహల్ సంచ‌ల‌నం !

Big Stories

Advertisement
×