E-Paper
Advertisement

Siva Kumar -Priyanka Jain:వెయ్యేళ్ళ చరిత్ర కలిగిన ఆలయంలో శివ కుమార్ ప్రియాంక వివాహం.. ఎప్పుడంటే?

Siva Kumar -Priyanka Jain:వెయ్యేళ్ళ చరిత్ర కలిగిన ఆలయంలో శివ కుమార్ ప్రియాంక వివాహం.. ఎప్పుడంటే?
Advertisement

Siva Kumar -Priyanka Jain: బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించి నటీనటులుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో ప్రియాంక జైన్ (Priyanka Jain), శివకుమార్(Shiva Kumar) జంట ఒకటి. వీరిద్దరూ మౌనరాగం అనే సీరియల్ ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. మొదటి సీరియల్ తోనే ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న వీరిద్దరూ ఈ సీరియల్ సమయంలోనే ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. ఇక మౌనరాగం సీరియల్ తర్వాత వీరిద్దరూ పలు బుల్లి సీరియల్స్ లో నటిస్తూ సందడి చేస్తున్నారు. ఇకపోతే ప్రియాంక శివకుమార్ ఇద్దరు కూడా ప్రేమలో ఉండడంతో తరచూ వీరు పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి.

పెళ్లి పై ప్రియాంక జైన్ కామెంట్స్..

గత కొంతకాలంగా పెళ్లి చేసుకోబోతున్నామని చెబుతూ వస్తున్నారు తప్ప ఇప్పటివరకు పెళ్లి మాత్రం చేసుకోలేదు అయితే తాజాగా ప్రియాంక జైన్ పెళ్లికి సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం శివకుమార్ ప్రియాంక ఇద్దరు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ జంటను జడ్జ్ రాధా పెళ్లికి సంబంధించి ప్రశ్నలు వేశారు. ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు? పెళ్లి ఆలస్యానికి గల కారణమేంటంటూ ప్రశ్నలు ఎదురవడంతో ప్రియాంక తన పెళ్లి గురించి మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు.

త్రియుగి నారాయణ్ ఆలయంలో పెళ్లి..

Advertisement

ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ మేము ఎప్పటినుంచో పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాం కానీ కొన్ని కారణాల వల్ల పెళ్లి వాయిదా వేసుకోవలసి వస్తుందని తెలిపారు. పెళ్లి ఆలస్యమైన మా పెళ్లి ఎక్కడ ఎలా జరగాలి అనే విషయంలో మాత్రం చాలా క్లారిటీతో ఉన్నామని ప్రియాంక తెలిపారు. తాము ఉత్తరాఖండ్ లోని ప్రసిద్ధ త్రియుగి నారాయణ్ ఆలయంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రియాంక తెలిపారు. ఈ ఆలయానికి సుమారు 1200 సంవత్సరాల పైగా చరిత్ర కలిగి ఉందని పురాణాలు చెబుతున్నాయి. ఇక పురాణాల ప్రకారం శివపార్వతుల వివాహం కూడా ఈ ఆలయంలోనే జరిగిందని తెలుస్తోంది. శ్రీ విష్ణుమూర్తి పార్వతికి అన్నగా ఉండి ఈ ఆలయంలోనే కన్యదానం జరిపించారని పురాణాలు చెబుతున్నాయి.

పెళ్లికి సిద్ధమైన శివ్ ప్రియాంక..

Advertisement

ఇలాంటి ఎంతో పవిత్రమైన ఆలయంలో తమ పెళ్ళి జరగబోతోంది అంటూ ప్రియాంక జైన్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఇలా పెళ్లి ఎక్కడ జరగాలో చెప్పిన ఈమె ఎప్పుడు చేసుకుంటున్నారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అలాగే తన పెళ్లి తరచూ వాయిదా పడటానికి గల కారణాలు ఏంటి అనే విషయాన్ని కూడా ప్రియాంక ఎక్కడా బయట పెట్టలేదు. ప్రియాంక ఇటీవల బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం ఈమె బుల్లితెర సీరియల్స్ కి దూరంగా ఉన్నప్పటికీ పలు వెబ్ సిరీస్లలో నటిస్తున్నారు. అదేవిధంగా పలు బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. మరోవైపు శివ్ పలు బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈయన స్టార్ మాలో నిన్ను కోరి అనే సీరియల్ లో నటిస్తున్నారు.

Also Read: Pawan Kalyan: రామ్ చరణ్ కు ప్రమాదం.. పవన్ కళ్యాణ్ పోస్ట్ వైరల్..

Related News

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 3rd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు వెనకాలే ఫాలో అవుతున్న రౌడీలు  

బిగ్ బాస్ షోలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న కంటెస్టెంట్ ఈమె!

Gundeninda Gudigantalu : సీరియల్లో యూట్యూబర్ ఎంట్రీ.. ఇదేం ట్విస్ట్ మావా..

Intinti Ramayanam : పల్లవి అవుట్.. ఫ్యాన్స్ కు మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..

Big Stories

Advertisement
×