E-Paper
Advertisement

ICC-Pakistan: అన్ని మూసుకుని ఇండియాతో ఆడాల్సిందే..లేక‌పోతే అడుక్కు తింటారు, పాకిస్తాన్ కు ఐసీసీ వార్నింగ్‌

ICC-Pakistan: అన్ని మూసుకుని ఇండియాతో ఆడాల్సిందే..లేక‌పోతే అడుక్కు తింటారు, పాకిస్తాన్ కు ఐసీసీ వార్నింగ్‌
Advertisement

ICC-Pakistan: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026) నేపథ్యంలో పాకిస్తాన్ యూటర్న్ తీసుకుంది. ఈ టోర్నమెంట్ ఆడతాం కానీ, ఫిబ్రవరి 15వ తేదీన ఇండియాతో ( Team India) జరిగే మ్యాచ్ మాత్రం ఆడబోమని, బాయ్ కాట్‌ చేస్తున్నట్లు పాకిస్తాన్ సర్కార్ స్వయంగా ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో అధికారిక ప్రకటన చేసింది పాకిస్తాన్ ప్రభుత్వం ( Pakistan Government). దీనిపై ఐసీసీకి కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు స‌మాచారం అందించిన‌ట్లు చెబుతున్నారు. దీంతో ఈ టోర్నమెంట్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి. అయితే పాకిస్తాన్ సర్కార్ ఈ ప్రకటన చేసిన నేపథ్యంలో ఐసీసీ ( ICC) వెంటనే స్పందించింది. టి20 ప్రపంచ కప్ 2026 ఆడే ప్రతి జట్టు అన్ని మ్యాచ్ లు ఆడాల్సిందేనని వెల్లడించింది. ఇండియాతో జరిగే మ్యాచ్ బాయ్ కాట్‌ ( Ind VS Pak Boycott) చేస్తామంటే అస్సలు కుదరదని, ప్రతి మ్యాచ్ ఆడాల్సిందేనని వెల్లడించిందట ఐసీసీ. ఈ టోర్నమెంట్ లో అడుగుపెడితే, మొత్తం మ్యాచులు ఆడాల్సిందే.. బాయ్ కాట్ చేయడానికి ఎలాంటి హక్కు లేదని పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చిందని తెలుస్తోంది.

Also Read: T20 World Cup 2026: ఇండియా మ్యాచ్‌ను బాయ్ కాట్ చేసిన పాకిస్తాన్‌..PCBకి రూ.300 కోట్ల న‌ష్టం? మ‌నోళ్ల‌కు లాభ‌మే, వివరాలు ఇవే

పాకిస్తాన్ ప్రకటనపై ఐసీసీ రియాక్షన్ ఇదే

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026) నేపథ్యంలో తమ జట్టు ఆడుతుంది కానీ.. ఫిబ్రవరి 15వ తేదీన ఇండియాతో జరిగే మ్యాచ్ మాత్రం ఆడబోదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సమాచారం ఇచ్చిందట. అయితే దీనిపై తాజాగా ఐసీసీ స్పందించింది. ఈ మేరకు బహిరంగ లేఖ‌ కూడా విడుదల చేసింది. ఇండియాతో మ్యాచ్ బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచి ఎలాంటి సమాచారం తమకు రాలేదని, అధికారిక ప్రకటన వస్తే అప్పుడు చూస్తామని వెల్లడించింది ఐసిసి. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం ఇండియా మ్యాచ్ ను బహిష్కరిస్తున్నట్లు తమకు సమాచారం అందిందని వెల్లడించింది. పీసీబీ మాత్రం త‌మ‌కు సమాచారం అందించ‌లేద‌ని వివ‌రించింది.

కానీ పాకిస్తాన్ స‌ర్కార్‌ ప్రకటన అంతర్జాతీయ క్రీడా సమగ్రతను దెబ్బతీస్తుందని వెల్లడించింది ఐసిసి. పాకిస్తాన్ దేశంలో కూడా క్రికెట్ పై దీర్ఘకాలిక పరిణామాలు ఉండవచ్చని వెల్లడించింది. పాకిస్తాన్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మరోసారి ఆలోచిస్తే బెటర్ అని సూచనలు చేసింది ఐసీసీ పాలన మండలి. జాతీయ విధానాలను తాము గౌరవిస్తామని.. అయితే అందరికీ ఆమోదమైన నిర్ణయాన్ని మాత్రం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీసుకోవాలని వెల్లడించింది. అలా కాదని మొండి పట్టు పడితే, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆర్థికంగా నష్టపోతుందని వార్నింగ్ కూడా ఇచ్చింది ఐసీసీ. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్లో అడుగుపెట్టిన ప్రతి జట్టు, బాయ్ కాట్ అనే విషయం లేకుండా అన్ని మ్యాచ్ లు ఆడాల్సిందేనని తెలిపింది. అలా కాదని బాయ్ కాట్ చేస్తే, తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా వార్నింగ్ ఇచ్చింది.

Advertisement

Also Read: Ind vs Pak Match-fixing: ఇండియాతో ఫిక్సింగ్ ? ఫోన్ లో చాటింగ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిని పాక్ కోచ్ స‌ర్ఫ‌రాజ్!

 

 

 

Related News

ఉగ్రవాదుల టెన్షన్..21 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌లో అడుగుపెట్టిన ఇంగ్లాండ్

చిన్నస్వామిలో వర్షం పడాలని పోర్లు దండాలు పెట్టండి, లేకపోతే విండీస్ ఘోర ఓటమే!

విరాట్ కోహ్లీ నాలాగే ఉంటాడు కానీ, పెద్ద అంద‌గాడు కాదు !

వాళ్లంద‌రితో జై హిందూ అనిపించండి, ష‌మీ కామెంట్స్ వైర‌ల్ !

టీమిండియాకు ఏది చేత‌కాదు, ఇప్ప‌టికే విండీస్ సిరీస్ గెలిచింది, ట్రోఫీ ఇచ్చేయండి

టీమిండియా రూ.250 కోట్లు దొబ్బుకుపోతే, మాకు ఒక్క రూపాయి ఇవ్వ‌డం లేదు

నోటికి ప్లాస్ట‌ర్ వేసి, 15వ అంతస్తు నుంచి కిందకు వేలాడదీశారు!

విడాకులు త‌ర్వాత ప‌చ్చి తాగుబోతున‌య్యా..ధ‌న శ్రీపై యుజ్వేంద్ర చాహల్ సంచ‌ల‌నం !

Big Stories

Advertisement
×