Arshdeep Singh: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ టోర్నమెంట్ లో 40 కి పైగా మ్యాచులు పూర్తయ్యాయి. సరిగ్గా మరో నెల రోజుల పాటు ఈ మెగా టోర్నమెంట్ కొనసాగుతుంది. ఇలాంటి నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ (Punjab Kings vs Rajasthan Royals, 40th Match) మధ్య ముల్లాన్పూర్ వేదికగా కీలక ఫైట్ జరిగింది. ఈ సందర్భంగా ఓటమి ఎరుగని పంజాబ్ కింగ్స్ ను మట్టి కరిపించింది రాజస్థాన్ రాయల్స్. ఈ మ్యాచ్ అనంతరం జరిగిన సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament) భాగంగా పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ (Punjab Kings vs Rajasthan Royals) మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ అనంతరం వైభవ్ సూర్య వంశీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిందట పంజాబ్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ ( Arshdeep Singh ) ప్రియురాలు సమ్రీన్ కౌర్. చేతిలో ఏదో ఎలక్ట్రానిక్ ఐటమ్ గిఫ్టుగా వైభవ్ సూర్య వంశీకి ఇచ్చినట్లు ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఆ తర్వాత టైట్ హగ్ కూడా ఇచ్చిందట. అర్ష్‌దీప్ సింగ్ డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగినట్టు చెబుతున్నారు.
దీంతో సోషల్ మీడియాలో రక రకాల కామెంట్లు పెడుతున్నారు. అప్పట్లో భుట్టో… ఇప్పుడు ముసారఫ్ అన్నట్లుగా సమ్రీన్ కౌర్ వ్యవహారం నడుస్తోందని ట్రోలింగ్ కూడా మొదలుపెట్టారు. అర్ష్‌దీప్ సింగ్ తో డేటింగ్ లో ఉన్న సమ్రీన్ కౌర్ (Samreen Kaur) ఇలా వ్యవహరించడం చాలా దారుణం అంటూ ఫైర్ అవుతున్నారు. ఈ విషయం తెలిస్తే అర్ష్‌దీప్ సింగ్ గుండె పగిలిపోతుందని కామెంట్స్ చేస్తున్నారు. అతి త్వరలోనే దినేష్ కార్తీక్ కు పట్టిన గతి అర్ష్‌దీప్ సింగ్ ( Arshadeep singh) కూడా పడుతుందని హెచ్చరిస్తున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా అదరగొడుతున్న వైభవ్ సూర్యవంశీకి ప్రీతి జింటా హగ్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. అలాగే ఫ్లయింగ్ కిస్ ఇచ్చిందని కూడా కొంత మంది వైరల్ చేస్తున్నారు. తమ జట్టుపై అద్భుతంగా రాణించినందుకు గాను… కాస్త బెండ్ అయిన ప్రీతి జింటా… వైభవ్ కు కిస్ ఇచ్చిందని చెబుతున్నారు. దీంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ అయింది.
?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==
https://www.facebook.com/100078498515993/photos/vaibhav-suryavanshi-surprised-when-arshdeep-singh-girlfriend-samreen-kaur-gave-h/1006323908660884/