BigTV English

Vijay Mallya : ముంబై ఇండియన్స్ ఫైట్ స్కెచ్ వేసిన విజయ్ మాల్యా.. అంబానీని టచ్ చేయడం ఎవడి తరం కాదు

Vijay Mallya : ముంబై ఇండియన్స్ ఫైట్ స్కెచ్ వేసిన విజయ్ మాల్యా.. అంబానీని టచ్ చేయడం ఎవడి తరం కాదు

Vijay Mallya : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 2025 ఐపీఎల్ సీజన్ లో టైటిల్ సాధించి ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. 18 సీజన్ల టైటిల్ కరువును ఆ జట్టు ముగించింది. ఆర్సీబీ జట్టు తొలిసారి ఛాంపియన్ గా నిలిచింది. కానీ బెంగళూరు చేరుకున్న తరువాత వారి వేడుక కాస్త సంతాపంగా మారింది. బెంగళూరు చిన్న స్వామి స్టేడియం దగ్గర జరిగిన వేడుకల సందర్భంగా అభిమానుల మధ్య తొక్కిసలాట జరిగి  11 మంది ప్రాణాలను కోల్పోయారు. దీంతో పాటు 50 మందికి పైగా గాయపడ్డారు. వాస్తవానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 2008 నుంచి లీగ్ లో కొనసాగుతోంది. అయితే 18వ సీజన్ లో మొదటిసారి ఛాంపియన్ గా నిలిచింది. ఈ జట్టు విజయం తరువాత అభిమానులు పరారీలో ఉన్న విజయ్ మాల్యాను కూడా గుర్తు చేసుకున్నారు. ఎందుకంటే..? ఆర్సీబీ ఫ్రాంచైజీ కి మొదటి యజమాని విజయ్ మాల్యానే.


Also Read :  Case on Virat : లండన్ పారిపోయిన విరాట్ కోహ్లీ పై.. బెంగళూరులో కేసు నమోదు!

విజయ్ మాల్యా రాజ్ షమానీతో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక ఆ ఇంటర్వ్యూలో కీలక విషయాలను వెల్లడించాడు. ముంబై ఇండియన్స్ జట్టుతో సహా మూడు ఫ్రాంచైజీలకు బిడ్ వేసినట్టు తెలిపాడు. అయితే ముంబై ఇండియన్స్ ని కొని రాయల్ ఛాలెంజర్స్ ముంబై అని పెట్టాలనుకున్నట్టు తెలిపాడు. అయితే ముఖేష్ అంబానీ అత్యధిక ధరను కోట్ చేయడంతో కొనలేకపోయినట్టు చెప్పుకొచ్చాడు. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ని అతి తక్కువ తేడాతో కోల్పోయిన తరువాత విజయ్ మాల్యా చివరికీ 112 మిలియన్ల యూఎస్ డాలర్ల కి ఆ సమయంలో ఆర్సీబీ ని కొనుగోలు చేశాడు. 2008లో 112 మిలియన్ల అమెరికన్ డాలర్ల విలువ సుమారు రూ.600-700 కోట్లు.. ఆర్సీబీ ని కొనుగోలు చేయడం వెనుక ఉన్న ఏకైక ఉద్దేశం తన విస్కీ బ్రాండ్ రాయల్ ఛాలెంజ్ ని ప్రోత్సహించడమే అని చెప్పుకొచ్చాడు విజయ్ మాల్యా.


RCB ని పవర్ హౌస్ గా మార్చగల ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాను. అండర్ -19 ప్రపంచకప్ జట్టులో యువఆటగాడు విరాట్ కోహ్లీ ని గుర్తించడం తనకెంతో గర్వకారణం అని పేర్కొన్నాడు. అతను ప్రత్యేమైన క్రికెటర్ అని తన అంతర్గత స్వభావం చెప్పింది అని.. రాహుల్ ద్రవిడ్ ఐకాన్ ప్లేయర్ గా పొందడం గొప్ప ఆలోచన.. బెంగళూరు గర్వించదగిన వ్యక్తి ద్రవిడ్. జాక్వెస్ కలిస్, అనిల్ కుంబ్లే, జహీర్ ఖాన్ వంటి ప్రపంచ స్టార్లను తీసుకొచ్చామని.. ఐపీఎల్ ట్రోఫీని బెంగళూరుకు తీసుకురావాలనేది తన కల.. ఆ లక్ష్యంతోనే జట్టును నిర్మించినట్టు వెల్లడించారు.  రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఎంపిక కి కొద్ది సేపటి ముందు అండర్-19 ప్రపంచకప్ ఆడుతున్నాడు విరాట్ కోహ్లీ. అండర్-19 జట్టులో అతని ఆటను చూసి ఎంచుకున్నట్టు వెల్లడించాడు. విరాట్ కోహ్లీ ఆర్సీబీ జట్టుకి 18 సంవత్సరాల తరువాత కూడా ఆడటం విశేషం. విరాట్ కోహ్లీ ఎప్పటికీ గొప్ప భారతీయ క్రికెటర్లలో ఒకడు అని వెల్లడించాడు విజయ్ మాల్యా. విజయ్ మాల్యా ఉన్న సమయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ తరువాత పార్టీలు బాగా చేసుకోవడం విశేషం.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×