BigTV English

Peddi : ‘పెద్ది’ మూవీ అప్డేట్.. అర్ధరాత్రి ఆ పని చెయ్యాల్సిందేనా..?

Peddi : ‘పెద్ది’ మూవీ అప్డేట్.. అర్ధరాత్రి ఆ పని చెయ్యాల్సిందేనా..?

Peddi : టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టింది. త్రిపుల్ ఆర్ తర్వాత వచ్చిన ఈ మూవీ దారుణంగా అభిమానులను నిరాశ పరిచింది. దాంతో ఈ మూవీ తర్వాత ఏ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తాడా అని ఆసక్తిగా ఎదురు చూశారు. ఉప్పెన మూవీతో టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన బుచ్చిబాబుతో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రానికి పెద్ది అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక బుచ్చిబాబు వరుస షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారు. ప్రజెంట్ నైట్ యాక్షన్ సీన్స్ జరుగుతున్నాయి.. ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.


అర్ధరాత్రి ఆ పని చెయ్యాల్సిందే..? 

రామ్ చరణ్ ను గతంలో ఎన్నడూ చూడని విధంగా ఈ మూవీలో కనిపించబోతున్నాడు. క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రజెంట్ రామోజీఫిల్మ్ సిటీలో జరుగుతోంది. నైట్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ సీన్స్ జరుగుతున్నాయి. ఈ మూవీకి ఈ ఎపిసోడ్ హైలెట్ గా నిలుస్తుందని సమాచారం. ఈ షెడ్యూల్ మొత్తం రాత్రి షూటింగ్ ఎక్కువగా ఉంటుందని టాక్. అందుకే డైరెక్టర్ ఈ యాక్షన్ ఎపిసోడ్ పై ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు టాక్.. అందుకే అర్ధరాత్రి దాటిన షూటింగ్ ను ఆపట్లేదని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.


Also Read : ‘వార్ 2’ కు తెలుగులో లెక్కలు మారినట్లే.. టార్గెట్ ఎన్ని కోట్లంటే..?

ఉత్తరాంధ్రలో నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్..

రామ్ చరణ్ పెద్ది మూవీ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ఏర్పాటు చేసిన పెద్ద సెట్లో జరుగుతుంది. యాక్షన్ ఎపిసోడ్ గా రాబోతున్న ఈ మూవీకి ఇదే హైలెట్ కాబోతుంది. ఈ షెడ్యూల్ అవ్వగానే వెంటనే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఓ షెడ్యూల్ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. వచ్చే జులై రెండో వారం నుంచే అక్కడ షూటింగ్ చేస్తారంట. జాన్వీకపూర్, రామ్ చరణ్‌ పై ఆ సీన్స్ ఉండే ఛాన్స్ ఉంది. జగపతిబాబు, ఆమని సీన్లు కూడా ఉంటాయంట. ప్రేమ, ఆత్మగౌరవం, కుటుంబం నేపథ్యంలో మూవీ ఉంటుందంట. భావోద్వేగాలకు పెద్ద పీట వేస్తున్నామని డైరెక్టర్ ఎప్పుడో అన్నారు. రంగస్థలం కన్నా ఎక్కువగా ఈ సినిమా ఉంటుందని రామ్ చరణ్ హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. గతంలో వచ్చిన గేమ్ చేంజర్ మూవీ నిరాశ పరచడంతో పెద్ది మూవీ కోసం రామ్ చరణ్ అభిమానులతో పాటు సినీ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ మూవీ తర్వాత టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తర్వాత RRR సీక్వెల్ సినిమా చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×