BigTV English
Advertisement

Raja Saab : డైరెక్టర్ మారుతి ప్రూవ్ చేసుకోవాల్సిన టైం వచ్చేసింది..?

Raja Saab : డైరెక్టర్ మారుతి ప్రూవ్ చేసుకోవాల్సిన టైం వచ్చేసింది..?

Raja Saab : పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. గతేడాది కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ ఆ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను త్వరలోనే థియేటర్లలోకి తీసుకురావాలనే ఆలోచనలో ప్రభాస్ ఉన్నట్లు తెలుస్తుంది. దాదాపు షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ మూవీ పై మారుతి ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరోతో సినిమా అంటే మాటలు కాదు. తన సత్తాను చాటే సమయం వచ్చింది. ఇది కనక హిట్ అయితే డైరెక్టర్ రేంజ్ పాన్ ఇండియా లెవల్ కు వెళ్తుంది..


మారుతి టాలెంట్ కు ఇది పరీక్షే..

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ మారుతి తెలుగు ఇండస్ట్రీలో చిన్న సినిమా నుంచి తన కెరీర్ మొదలు పెట్టడం వల్ల అతనికి మంచి కమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా ఆడియన్స్ పల్స్ పట్టేసిన మారుతి కెరీర్ మొదట్లో కాస్త అడల్ట్ డైలాగ్స్ తో సక్సెస్ అందుకున్నా కూడా ఆ తర్వాత తన ట్రాక్ ను మార్చుకున్నాడు. ఆ తర్వాత కామెడీ జోనర్ లో సినిమాలు చేసి సక్సెస్ అయ్యాడు. మారుతి సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనేలా చేసుకున్నాడు. అయితే పక్కా కమర్షియల్ తర్వాత మారుతి 3 ఏళ్లు గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. రాజా సాబ్ టైటిల్ తో మూవీ రాబోతుంది. పెద్ద హీరోతో సినిమా కావడంతో మారుతి జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తుంది. మారుతి రాజా సాబ్ సినిమా షూటింగ్ జరుగుతున్నా అప్డేట్స్ ఇవ్వట్లేదని మారుతిని రెబల్ స్టార్ ఫ్యాన్స్ టార్గెట్ చేశారు.. కానీ మారుతి మౌనంగానె ఉంటున్నాడు. అదే సినిమాకు క్యూరియాసిటిని పెంచుతుంది.


Also Read :‘పెద్ది’ మూవీ అప్డేట్.. అర్ధరాత్రి ఆ పని చెయ్యాల్సిందేనా..?

డిసెంబర్ లో రాజా సాబ్ వచ్చేస్తుంది..!

రాజా సాబ్ మూవీపై మొదటి నుంచి భారీ అంచనాలే క్రియేట్ అవుతున్నాయి. ఇన్నాళ్లు తన మార్క్ ఎంటర్టైనర్ సినిమాలతో అలరించిన మారుతి రాజా సాబ్ తో పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాతో తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం వచ్చేసిందని డార్లింగ్ ఫ్యాన్స్ అంటున్నారు. ఇప్పటివరకు రిలీజ్ అయిన పోస్టర్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి.. ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించడం ప్లస్ అయ్యింది. అందుకే సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇక ఇందులో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తుండగా ఫ్యాన్స్ కి ఈ సినిమా సూపర్ ట్రీట్ ఇస్తుందని అంటున్నారు. మరి మారుతికి ఈ మూవీ సక్సెస్ ను అందిస్తుందేమో చూడాలి..

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×