Case on Virat : ఐపీఎల్ సీజన్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆర్సీబీ విజయం సాధించడంతో ముఖ్యంగా కీలక ఆటగాడు విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురయ్యారు. దాదాపు 18 సంవత్సరాల తరువాత టైటిల్ సాధించడంతో ఎమోషనల్ అయ్యాడు. విరాట్ కోహ్లీని చూసిన అభిమానులు సైతం అలాగే ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు. దేశవ్యాప్తంగా ఆర్సీబీ అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. బుధవారం రోజు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవ సంబురాలు జరుపుకున్నారు. అయితే ఈ తొక్కిసలాటకు కారణం విరాట్ కోహ్లీ అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట ఘటనకు విరాట్ కోహ్లీ కూడా కారణమని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసాడు రియల్ ఫైటర్స్ ఫోరం అధ్యక్షుడు వెంకటేశ్ కబ్బన్ పార్క్.
Also Read : Rcb fan : RCB కప్ గెలిచిందని పిచ్చోడిలా.. రక్తం పారిస్తారా..!
వాస్తవానికి విరాట్ కోహ్లీ 18 సంవత్సరాల పాటు ఆర్సీబీ జట్టుకి ఆడాడు. అతను ఆడినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ కూడా రాలేదు. దీంతో అభిమానులు అవమానాలు ఎదుర్కొన్నారు. 18 సీజన్ కి టైటిల్ రావడంతో సంబురాలు జరుపుకున్నారు. కానీ తొక్కిసలాట జరగడంతో 11 మంది మృతి చెందారు. ఈ తొక్కిసలాట కి విరాట్ కోహ్లీ నే కారణం అని ఫిర్యాదు చేశారు. వాస్తవానికి విరాట్ కోహ్లీకి అభిమానులు చాలా ఎక్కువ ఉంటారు. ఆర్సీబీ అంటే విరాట్ కోహ్లీ అభిమానులే అని ఎవ్వరైనా చెబుతారు. అందుకే విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయాలని ఫిర్యాదులో కోరారు. ఆర్సీబీ టైటిల్ సాధించడంతో సంబురాలు జరిగిన అనంతరం విరాట్ కోహ్లీ లండన్ పారిపోయాడు. దీంతో పలువురు విరాట్ కోహ్లీ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా విమర్శలకుల నోరు మూయించారు. “ఆర్సీబీ అది.. ఆర్సీబీ ఇది అని చాలా మంది మమ్మల్ని ట్రోల్ చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును అపహాస్యం చేస్తూ.. ఆట పట్టించారు. కానీ అవి మమ్ముల్ని మరింత ధృడంగా మార్చాయి. మా అభిమానులకు, మాకు మధ్య చాలా గట్టి అనుబంధం ఉంది. వారు ప్రతీసారి మాకు మద్దతుగా నిలిచారు. దేవుడు చాలా గొప్పవాడు. ఇప్పుడిక నేను పసిపిల్లాడిలా ప్రశాంతంగా నిద్రపోతాను”అని కోహ్లీ విమర్శకులకు చురకలంటించారు.
బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం వద్ద జూన్ 04న జరిగిన భారీ తొక్కిసలాటలో 11 మంది మరణించిన విషయం విధితమే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2025 విజయోత్సవ ర్యాలీ సందర్భంగా జరిగిన ఈ ఘటనలో 11 మంది మరణించగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఇప్పటికే ఆర్సీబీ, dna ఈవెంట్ మేనేజ్ మెంట్, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ లపై కేసు నమోదైంది. తాజాగా ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు అసలు విరాట్ కోహ్లీ మీద కేసు నమోదు చేయడం సాధ్యమా..? కాదా అనే విషయం పై పోలీసులు న్యాయ సలహా తీసుకోవడం విశేషం.
తొక్కిసలాటకు కారణం కోహ్లి అంటూ పోలీసులకు ఫిర్యాదు
చినస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట ఘటనకు విరాట్ కూడా కారణమని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన రియల్ ఫైటర్స్ ఫోరం అధ్యక్షుడు వెంకటేశ్ కబ్బన్ పార్క్ pic.twitter.com/KTZ47FeTwh
— Telugu Scribe (@TeluguScribe) June 6, 2025