Kohli-Sai Sudharsan: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) విజేతగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) నిలిచింది. ఇప్పటికే 2025 టోర్నమెంట్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, అదే ఊపుతో ఈ సారి కూడా టైటిల్ ఎగరేసుకు వెళ్లింది. ఫైనల్స్ మ్యాచ్ లో చాలా అగ్రెసివ్ గా విరాట్ కోహ్లీ ఆడి, మ్యాచ్ గెలిపించాడు. చివరి వరకు నిలబడ్డ విరాట్ కోహ్లీ ( Virat Kohli) ఏకంగా 75 పరుగులు సాధించాడు. చివరి బంతికి సిక్సర్ కొట్టి, మ్యాచ్ గెలిపించాడు విరాట్ కోహ్లీ. దీంతో బెంగళూరు ఖాతాలో రెండు టైటిల్ పడింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా అహ్మదాబాద్ లోని (Narendra Modi Stadium, Ahmedabad) నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ( Royal Challengers Bengaluru vs Gujarat Titans, Final) మధ్య ఆదివారం ఫైనల్స్ జరగగా, ఈ మ్యాచ్ లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. చేజింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీని డిస్టర్బ్ చేసేందుకు, సాయి సుదర్శన్ ను గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమాన్ గిల్ వాడినట్లు తెలుస్తోంది. బెంగళూరు నాలుగు వికెట్స్ పడిన తర్వాత, విరాట్ కోహ్లీ తో సాయి సుదర్శన్ (Sai Sudharsan) గొడవ పెట్టుకున్నాడు. నువ్వు ఔట్ అవ్వు.. ఆ తర్వాత మ్యాచ్ మొత్తం మా చేతుల్లోకి వస్తుందని హింట్ ఇచ్చాడు సాయి సుదర్శన్.
అయితే తానేం అవుట్ కానని.. చివరి వరకు ఉంటానని విరాట్ కోహ్లీ ( Virat Kohli ) స్పష్టం చేసినట్లు వీడియో వైరల్ గా మారింది. అలా రెండుసార్లు ఓవర్ల మధ్యలో ఇద్దరు తారాసపడ్డారు. అయితే సాయి సుదర్శన్ ఎంత డిస్టర్బ్ చేసినప్పటికీ… విరాట్ కోహ్లీ కూల్ గా ఆన్సర్ ఇచ్చాడు. అదే సమయంలో వికెట్ కోల్పోకుండా సహనంతో ఆడాడు. ఫలితంగా రెండోసారి బెంగళూరు ఛాంపియన్ అయింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 155 పరుగులు సాధించింది. ఇక ఈ లక్ష్యాన్ని 18 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి ఫినిష్ చేసింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.
ఓపెనర్ గా బరిలోకి దిగిన బెంగళూరు ఆటగాడు వెంకటేష్ అయ్యర్ ను స్లెడ్జింగ్ చేశాడు మహమ్మద్ సిరాజ్ ( Md Siraj). వికెట్ పడడం లేదన్న కోపంతో… పైపైకి వెళ్లి రెచ్చగొట్టాడు. అయితే, ఈ విషయంలో సిరాజ్ సక్సెస్ అయ్యాడు. సిరాజ్ దెబ్బకు డిస్టర్బ్ అయిన వెంకటేష్ అయ్యర్ క్యాచ్ ఔట్ అయ్యాడు.
Heated exchange between Virat Kohli and Sai Sudharsan during the RCB vs Gujarat Titans match 🤬🔥
– Virat Kohli looked furious at him 😭#RCBvsGT pic.twitter.com/AY74nwc1Qa
— T-Celebs (@t_celebs) May 31, 2026