E-Paper
Advertisement

Jay Shah-Vaibhav: ఫోన్ నెంబ‌ర్లు మార్చుకున్న జై షా, వైభ‌వ్..2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఛాన్స్ !

Jay Shah-Vaibhav:  ఫోన్ నెంబ‌ర్లు మార్చుకున్న  జై షా, వైభ‌వ్..2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఛాన్స్ !
Advertisement

Jay Shah-Vaibhav:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్   (Indian Premier League 2026 Tournament) విజయవంతంగా ముగిసింది. 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో వరుసగా రెండోసారి ఛాంపియన్ అయింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం (Narendra Modi Stadium, Ahmedabad) వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ( Royal Challengers Bengaluru vs Gujarat Titans, Final) మధ్య బిగ్ ఫైనల్స్ జరిగింది. ఇందులో బ్యాటింగ్ అలాగే బౌలింగ్ రెండు విభాగాలలో అద్భుతంగా రాణించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎట్టకేలకు ఫైనల్స్ లో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 155 పరుగులు సాధించింది. ఇక ఈ లక్ష్యాన్ని అవలీలగా ఛేదించి… 5 వికెట్ల తేడాతో విక్టరీ అందుకుంది బెంగుళూరు. దీంతో వరుసగా రెండోసారి టైటిల్ దక్కించుకుంది RCB. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, ఐసీసీ బాస్ జై షా ఇద్దరు పక్కపక్కన కూర్చోవడం హాట్ టాపిక్ అయింది. దోస్త్ మేరా దోస్త్ అన్నట్లుగానే ఈ ఇద్దరు కూర్చుని అందరికీ షాక్ ఇచ్చారు. ఈ క్రమంలో వైభవ్, షా ఫోటోలు వైరల్ గా మారాయి.

Also Read: Ravichandran Ashwin: వైభ‌వ్ రెండుస్లార్లు సెంచ‌రీ మిస్‌..క‌న్నీళ్లు పెట్టుకున్న అశ్విన్‌ కసరత్తులు చేసి, వ్యూహాన్ని

ఫోన్ నెంబ‌ర్లు మార్చుకున్న జై షా, వైభ‌వ్ సూర్య‌వంశీ

Advertisement

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఉన్న నేపథ్యంలో మోడీ స్టేడియానికి 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కూడా హాజరయ్యాడు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ బాస్ జై షా పక్కన కూర్చున్నారు వైభవ్. ఈ సందర్భంగా సరదాగా ఈ ఇద్దరు ముచ్చటించుకొని.. ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకున్న నేపథ్యంలో.. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి బంపర్ ఆఫర్ తగలబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. జై షాను క‌లిసాడు కాబ‌ట్టి, క‌చ్చితంగా టీమిండియాలో వైభ‌వ్ రాబోతున్న‌ట్లు కూడా ప్ర‌చారం చేస్తున్నారు.

ఐపీఎల్ 2026 లో ఆరెంజ్ క్యాప్ విన్నర్ గా వైభవ్ సూర్యవంశీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా నిలిచాడు 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. దీంతో వైభవ్ సూర్యవంశీకి ఆరెంజ్ క్యాప్ కింద పది లక్షలు దక్కాయి. ఈ టోర్నమెంట్లో మొత్తం 16 మ్యాచ్లలో వైభవ్ సూర్యవంశీ ప్రాతినిధ్యం వహించాడు. ఈ క్రమంలో ఒక సెంచరీ తో పాటు 15 అర్థ సెంచరీలు నమోదు చేసుకున్నాడు. మొత్తంగా 776 పరుగులు సాధించాడు 15 ఏళ్ల వైభవ్. ఈ క్రమంలోనే ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. అన్ క్యాప్ ప్లేయర్ గా ఉండి, ఆరెంజ్ క్యాప్ దక్కించుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. దీంతో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ పైన సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. అటు మాజీ క్రికెటర్లు కూడా అతన్ని మెచ్చుకుంటున్నారు. వెంటనే టీమిండియాలోకి తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Also Read: IPL 2026 Finals  RCB VS GT:  గుజ‌రాత్ వ‌ర్సెస్ RCB మ‌ధ్య ఫైన‌ల్స్..ముందే ఊహించిన అన‌న్య బిర్లా, పాత పోస్ట్ వైర‌ల్ 

 

 

Related News

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

ఐపీఎల్ ఆడ‌టానికి సిగ్గుగా లేదా? ద‌క్షిణాఫ్రికా ప్లేయ‌ర్ల‌పై ఆండ్రీ నెల్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×