Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫిట్నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. విరాట్ కోహ్లీ విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూనే.. నిత్యం తన ఫిట్నెస్ పై బాగా శ్రద్ధ చూపిస్తుంటాడు. అతను చేసే వర్కౌట్ వీడియోలను సోషల్ మీడియాలో తన అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటాడు. ఇక తన డైట్ కూడా చాలా ప్రత్యేకమని చెబుతుంటాడు. ఆ డైట్ కేవలం ఆహారానికి మాత్రమే వర్తించదు.
Also Read: BCCI: BCCIకి పెళ్ళాల టార్చర్.. దెబ్బకు వెనక్కి తగ్గారు ?
విరాట్ కోహ్లీ తాగే వాటర్ కూడా చాలా ప్రత్యేకం. ఎందుకంటే అతడు మినరల్ వాటర్ కి బదులు బ్లాక్ వాటర్ ని తాగుతాడు. అలా తన ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకునే విరాట్ కోహ్లీ తాగే మంచినీటి ఖరీదు తెలిస్తే నోరేళ్లబెట్టాల్సిందే. తాను బ్లాక్ వాటర్ తాగుతానని విరాట్ కోహ్లీ ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలలో తెలిపాడు. ఈ నీళ్లు హైడ్రేటెడ్ గా ఉండడమే కాకుండా పీహెచ్ అధికంగా ఉంటుంది. సాధారణంగా మనం తాగే వాటర్ ఒక లీటర్ ఖరీదు రూ. 20 నుండి ఆపై మరి కాస్త ఖరీదు ఉంటుంది. మహా అయితే 100, 200. ఇక అంతకుమించి మినరల్ వాటర్ కి ఎక్కువగా ఎవరూ ఖర్చు పెట్టరు.
కానీ విరాట్ కోహ్లీ తాగే బ్లాక్ వాటర్ ధర లీటర్ కి రూ. 4,000 వరకు ఉంటుంది. ఈ నీటిలో సహజసిద్ధమైన బ్లాక్ ఆల్కలాన్ శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉండేలా చేస్తుంది. అలాగే చర్మ నాణ్యతను మెరుగుపరచడంతో పాటు, మనిషి యొక్క బరువును కూడా అదుపులో ఉంచుతుంది. సాధారణ నీటి పీహెచ్ స్థాయి 6 నుండి 7గా ఉంటుంది. అదే ఈ బ్లాక్ వాటర్ పి హెచ్ స్థాయి మాత్రం 8.5 కావడం విశేషం. అలాగే ఈ బ్లాక్ వాటర్ లో 70కి పైగా మినరల్స్ ఉంటాయి.
ఇవి దీర్ఘకాలంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. అంతేకాకుండా ఈ బ్లాక్ వాటర్ తో ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. కరోనా సమయం నుండి చాలామంది సెలబ్రిటీలు ఈ బ్లాక్ వాటర్ తాగుతున్నారు. విరాట్ కోహ్లీ కూడా కరోనా ప్రారంభం నుంచే ఈ బ్లాక్ వాటర్ తాగడం మొదలెట్టాడు. ఛాంపియన్ ట్రోఫీకి ముందు విరాట్ కోహ్లీ ముంబై లో గేట్ వే ఆఫ్ ఇండియాని సందర్శించిన విషయం తెలిసిందే.
Also Read: Kane Williamson: న్యూజిలాండ్ కు పాకిస్తాన్ గ్రాండ్ వెల్కమ్.. ఏకంగా ఆ అమ్మాయిలతో?
ఈ క్రమంలో ఓ క్యాబ్ నుండి విరాట్ కోహ్లీ బయటకి దిగుతూ ఈ మినరల్ వాటర్ బాటిల్ తో కెమెరాకి చిక్కాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ తాగే ఈ వాటర్ గురించి మరోసారి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. అయితే ఈ వాటర్ బాటిల్ బ్లాక్ కలర్ లో కాకుండా.. వైట్ కలర్ లో కనిపించడంతో సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. కొందరు ఈ వాటర్ ధర కేవలం రూ. 250 మాత్రమే అని వాదిస్తుంటే.. మరికొందరు మాత్రం ఈ బాటిల్ ధర 4వేలకు పైగానే ఉంటుందని అంటున్నారు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">