Nandamuri TarakRatna: ఈ మధ్యకాలంలో చావు ఎప్పుడు వస్తుందో ఎవరం చెప్పలేం. నిలబడినవాళ్లు నిలబడినట్లే కుప్పకూలిపోయారు. 4 ఏళ్ళ వయస్సు నుంచి 40 ఏళ్ళ వయస్సువరకు గుండెపోటుతో ఉన్నచోటునే ప్రాణాలు విడుస్తున్నారు. అలా సడెన్ గా గుండెపోటుతో మరణించిన నటుడు నందమూరి తారకరత్న. నందమూరి వారసుడిగా ఒకటో నెంబర్ కుర్రాడు అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాడు. ఒకే ఏడాది తొమ్మిది సినిమాలకు సైన్ చేసిన హీరోగా కూడా రికార్డు సృష్టించిన ఘనత తారకరత్నది.
ఇక సినిమాలు చేస్తున్నా.. స్టార్ హీరోగా మాత్రం నిలబడలేకపోయాడు తారకరత్న. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే.. విడాకులు అయ్యి, ఒక బిడ్డకు తల్లి అయిన అలేఖ్యరెడ్డిని వివాహమాడాడు. ఇంట్లో వద్దని చెప్పినా.. దైర్యం చేసి అలేఖ్యను పెళ్లి చేసుకొని నందమూరి కుటుంబానికి దూరమయ్యాడు. వీరికి ముగ్గురు పిల్లలు. భార్యాబిడ్డలతో సంతోషంగా ఉన్న తారకరత్న సడెన్ గా నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొని గుండెపోటుకు గురైయ్యాడు. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం బెంగుళూరుకు తరలించారు. దాదాపు కొన్ని రోజులపాటు బెంగళూరులో చికిత్స తీసుకున్న ఈయన మృత్యువుతో పోరాడి చివరికి 2023 ఫిబ్రవరి 18న తుదిస్వాస విడిచారు.
ఇక కొడుకు చనిపోయినా తారకరత్న తల్లిదండ్రులు మాత్రం ఆమన్తే పట్టుదలతో ఉన్నారు. భర్త కోల్పోయిన అలేఖ్యను ఇంటికి ఆహ్వానించింది కూడా లేదు. అలేఖ్య ప్రస్తుతం పిల్లలతో కలిసి తారకరత్న తో కలిసి ఉన్న ఇంట్లోనే నివాసముంటుంది. వారికి బాలకృష్ణ సపోర్ట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. తారకరత్న చనిపోయిన దగ్గరనుంచి అలేఖ్య ఎంతో వేదనను అనుభవిస్తుంది. నిత్యం భర్తను తలుచుకొని సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెడుతూ వస్తుంది.
అనుపమ పరమేశ్వరన్ బర్త్ డే .. ఆమె నటించిన ఈ తెలుగు సినిమాలు చూశారా.. ?
ఇక నేడు నందమూరి తారకరత్న రెండవ వర్ధంతి. దీంతో మరోసారి భర్తను తలుచుకొని అలేఖ్య ఎమోషనల్ అయ్యింది. భర్త లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నానని, ఈ గాయాన్నికాలం కూడా మాన్పలేదని రాసుకొచ్చింది. ” విధి నిన్ను మా నుండి దూరం చేసిన రోజున ఈ లోకంలో ఏదీ పూరించదు.. నిన్ను కోల్పోయిన బాధ.. కాలం మాన్పలేని గాయం, ఏదీ భర్తీ చేయలేని హృదయ విదారకం.. మేం ఇలా విడిపోవాలని ఎప్పుడూ అనుకోలేదు… నువ్వు ఇక్కడ లేకపోవచ్చు కానీ. నీ ఉనికి మా జీవితాల్లో, నువ్వు విడిచిన కలల్లో, మసకబారడానికి నిరాకరించే ప్రేమలో.. మాటలకు మించి, కాలాన్ని దాటి, జీవితానికి మించి ఉంటుంది.. నిన్ను మిస్ అవుతున్నాం..” అంటూ ఎమోషనల్ అయ్యింది.
తారకరత్న ఫోటో వద్ద నివాళులు అర్పించి.. కొన్ని ఫోటోలను షేర్ చేసింది అలేఖ్య. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు తండ్రికి నివాళులు అర్పిస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ఇప్పటికైనా తారకరత్న తల్లిదండ్రులు మనసు మార్చుకొని కోడలిని, పిల్లల్ని దగ్గరకు తీసుకుంటే బావుంటుందని కామెంట్స్ పెడుతున్నారు. తారకరత్న అన్నను మేము కూడా మిస్ అవుతున్నాం వదినమ్మ.. మీరు, పిల్లలు జాగ్రత్త అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.