Kane Williamson: రేపు {ఫిబ్రవరి 19} ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఘనంగా ప్రారంభం కాబోతోంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ ఫిబ్రవరి 19 నుండి.. మార్చి 9 వరకు జరుగుతుంది. ఫిబ్రవరి 19న కరాచీలోని నేషనల్ బ్యాంక్ స్టేడియం మొదటి మ్యాచ్ కి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మొదటి మ్యాచ్ లో న్యూజిలాండ్ – పాకిస్తాన్ జట్లు తలపడతాయి. ఈ ట్రోఫీ కోసం ఇప్పటికే పాకిస్తాన్ చేరుకుంది న్యూజిలాండ్ జట్టు. తొలి మ్యాచ్ కి లాహోర్ నుండి న్యూజిలాండ్ జట్టు కరాచీకి బయలుదేరి వెళ్ళింది.
Also Read: Morne Morkel Father Demise: ఛాంపియన్ ట్రోఫీ కంటే ముందే టీమ్ ఇండియాలో విషాదం!
ఈ క్రమంలో ఫ్లైట్ లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ప్లెయిన్ లో న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్ సన్ ని మర్యాదపూర్వకంగా రిసీవ్ చేసుకుంది పాకిస్తాన్ మహిళా ఎయిర్ హోస్ట్. ఈ సందర్భంగా ఓ చాక్లెట్ కేక్ ని కేన్ మామ కి ఇచ్చింది. కేన్ మామ – పాకిస్తాన్ మహిళా హెయిర్ హోస్టర్ కి సంబంధించిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటోలో కేన్ మామ వెనకాల మరో న్యూజిలాండ్ ప్లేయర్ మిచెల్ నోరు తెరిచి గాఢ నిద్రలో ఉన్నాడు.
ఈ ఫోటో చూసిన నెటిజెన్లు నవ్వుకుంటున్నారు. అంతలా నోరు తెరిచి నిద్రపోవడం ఏమిటని కామెంట్స్ చేస్తున్నారు. ఇక చాంపియన్స్ ట్రోఫీకి ముందు న్యూజిలాండ్ జట్టు మంచి జోరుమీదుంది. ఇటీవల పాకిస్తాన్ లో జరిగిన ముక్కోనపు సిరీస్ లో న్యూజిలాండ్ ఛాంపియన్ గా నిలిచింది. మరోవైపు కేన్ మామ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. ఆ ముక్కోనప్పుడు టోర్నీలో ఓ సెంచరీ కూడా బాదాడు. ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగబోతోంది.
2000 సంవత్సరంలో ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత మరో ఐసిసి టోర్నీ గెలవని న్యూజిలాండ్.. ప్రస్తుతం ఈ కప్ పై కన్నేసింది. పాతికేళ్ల తర్వాత మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడాలని లక్ష్యంతో బరిలోకి దిగుతుంది. మరోవైపు 2015, 2019 వన్డే ప్రపంచ కప్ లో న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయింది. ఈ క్రమంలో ఈ టోర్నీలోనైనా ఆ జట్టు ఐసీసీ టైటిల్ నిరీక్షణ ముగుస్తుందేమో వేచి చూడాలి. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్తాన్ లో జరిగిన ట్రై సిరీస్ కి ముందు న్యూజిలాండ్ జట్టుపై పెద్దగా అంచనాలు లేవు.
Also Read: SRH Flag At Himalayas: హిమాలయాలపై SRH జెండా.. ఫుల్ జోష్ లో కావ్య పాప!
కానీ ట్రై సిరీస్ లో వరుసగా మూడు మ్యాచ్లు గెలిచి.. టైటిల్ గెలుచుకోవడంతో ఆ జట్టు ఒక్కసారిగా ఇతర జట్లకు హెచ్చరికలు పంపినట్లు అయింది. ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టులో ప్రతి ఒక్కరూ ఫామ్ లో ఉండడం ఆ జట్టుకు అనుకూల అంశం. ఇక భారత్ పై కూడా న్యూజిలాండ్ కి ఐసిసి టోర్నీలో అద్భుతమైన రికార్డ్ ఉంది. మరోవైపు భారత్ కి దుబాయిలో పెద్దగా ఆడిన అనుభవం లేదు. ఈ క్రమంలో న్యూజిలాండ్ జట్టు గ్రూప్ – ఏ లో అగ్రస్థానంలో ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Kane Williamson receives a special welcome at @Official_PIA 🎂
📸: Pakistan International Airlines pic.twitter.com/dhUxiQDWDV
— CricTracker (@Cricketracker) February 18, 2025