E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Wasim Akram: వైభ‌వ్ చివ‌రి వ‌ర‌కు ఉంటే..వ‌న్డేల్లో స్కోర్ 1000 దాట‌డం ప‌క్కా

Wasim Akram:  వైభ‌వ్ చివ‌రి వ‌ర‌కు ఉంటే..వ‌న్డేల్లో స్కోర్ 1000 దాట‌డం ప‌క్కా
Advertisement

Wasim Akram:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటులో (Indian Premier League 2026 tournament) అద్భుతంగా రాణించిన వైభవ్ సూర్యవంశీ, లిస్ట్ ఏ క్రికెట్ లో కూడా అదరగొడుతున్నాడు. తాజాగా శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, టీమిండియా మధ్య లంక వేదికగా ట్రై సిరీస్ జరిగింది. వన్డే ఫార్మాట్ లో జరిగిన ఈ టోర్నమెంట్ లో… అద్భుతంగా రానించి టీమిండియా చాంపియన్ అయింది. అయితే ఈ లిస్టు A టీమిండియా జట్టులో స్థానం దక్కించుకున్న వైభవ్ సూర్యవంశీ.. అదరగొట్టాడు. గ్రూప్ స్టేజ్ లో విఫలమైనప్పటికీ.. ట్రై సిరీస్ ఫైనల్ లో 94 పరుగులతో రెచ్చిపోయాడు. కేవలం 29 బంతుల్లోనే ఈ పరుగులు సాధించాడు వైభవ్.

Also Read: Ravichandran Ashwin weighs in on Ishan Kishan: అఫ్ఘాన్ పై సెంచ‌రీ చేశాడ‌ని ఎగిరి ప‌డొద్దు..వ‌ర‌ల్డ్ క‌ప్ కు ఇషాన్ అస‌లు ప‌నికే రాడు

Advertisement

అయితే వైభవ్ (Vaibhav Sooryavanshi,) దూకుడు బ్యాటింగ్ దెబ్బకు.. 50 ఓవర్లలో టీమిండియా 940 పరుగులు కొట్టడం గ్యారంటీ అంటూ ప్రొజెక్టెడ్ స్కోర్ బోర్డు వైరల్ గా మారింది. అయితే దీనిపై తాజాగా పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైభవ్ సూర్య వంశీ వన్డేల్లో కొనసాగితే.. 1000 పరుగులు దాటడం చాలా సులభమే అన్నారు. కానీ 50 ఓవర్లు ఫినిష్ అయ్యేవరకు వైభవ్ బ్యాటింగ్ చేస్తే మాత్రం, ఈ రికార్డు క్రియేట్ చేయడం జరుగుతుందన్నారు. ఇలాంటి ఆటగాన్ని చూస్తే దిమ్మ తిరిగిపోతుందని వ్యాఖ్యానించారు. దీంతో వైభవ్ పై వసీం అక్రమ్ (Wasim Akram) చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

వైభ‌వ్ చివ‌రి వ‌ర‌కు ఉంటే..వ‌న్డేల్లో స్కోర్ 1000 దాట‌డం ప‌క్కా

శ్రీలంక వేదికగా జరిగిన ట్రై సిరీస్ ఫైనల్స్ మ్యాచ్ లో 29 బంతుల్లో 94 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైభవ్ లాంటి క్రికెటర్ ను తాను ఎప్పుడు చూడలేదని పేర్కొన్నారు. అతడికి బౌలింగ్ చేయడం అంటేనే భయంగా ఉందని వెల్లడించారు. అతనికి చాలా డిఫరెంట్ టాలెంట్ ఉందని.. అందుకే అవలీలగా సిక్సర్లు, బౌండరీలు కొడతాడని పేర్కొన్నారు. 15 సంవత్సరాల వయసులోనే ఇలాంటి టాలెంట్ దక్కడం గ్రేట్ అన్నారు. వన్డేలో అతడు కొనసాగితే.. 1000 పరుగులు కూడా కొట్టేస్తాడని కుండబద్దలు కొట్టి చెప్పారు. 300కు పైగా స్ట్రైక్ రేట్ అతనికి ఉంటుందని.. 50 ఓవర్లు ఫినిష్ అయ్యే వరకు బ్యాటింగ్ చేస్తే మాత్రం కొడతాడు అన్నారు. అంతేకాదు వన్డేల్లో వైభవ్ సూర్య వంశీ కొనసాగితే… వన్డే ఫార్మాట్ కు పూర్వ వైభవం వస్తుందన్నారు. అయితే పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాత్రం… వైభవ్ తో ఆడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా కోరారు. దీంతో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Advertisement

 

Also Read:  Tanveer Ahmed On ICC Womens World Cup 2026 Womens Pakistan Team: నీకు చేత కాక‌పోతే త‌ప్పుకో..కోచ్ వహాబ్ రియాజ్ కు వార్నింగ్

 

Related News

ఈ లేత వ‌య‌స్సులో వేగంగా బ్యాటింగ్ చేసి, ప్రాణాల‌పైకి తెచ్చుకోవ‌ద్దు ? వైభ‌వ్ కు డారిల్ హెచ్చ‌రిక‌లు

ఎలిమినేట్ అయిన బుద్ది రాలేదు..ఫాస్ట్ ఫుడ్ తింటూ పాకిస్తాన్ క్రికెట‌ర్లు చిల్

FIFA World Cup 2026: అమెరికా లాక‌ర్ రూంలో ఇరాన్ లేఖ క‌ల‌క‌లం..!

ఎలిమినేట్ అయిన సిగ్గు రాలేదు…జై షాపై పాకిస్తాన్ స‌రికొత్త కుట్ర‌

కొంప‌ముంచిన‌ రాధ యాద‌వ్..రెండు క్యాచ్ లు మిస్‌, టీమిండియా ఎలిమినేట్ ?

పాకిస్తాన్ మ‌హిళ‌లకు క్రికెట్ చేత‌కాదు కానీ, వంట‌లు మాత్రం బాగా చేస్తారు

Pollard Vs Milind: పొలార్డ్ కే సినిమా చూపించిన మిలింద్..బిత్త‌ర‌పోయిన అంపైర్లు

Big Stories

×