E-Paper
Advertisement

BrahMos Deal: పాక్-సౌదీ కూటమికి భారత్ మైండ్ బ్లాకింగ్ కౌంటర్.. గల్ఫ్ దేశంతో హిస్టారికల్ ఒప్పందం!

BrahMos Deal: పాక్-సౌదీ కూటమికి భారత్ మైండ్ బ్లాకింగ్ కౌంటర్.. గల్ఫ్ దేశంతో హిస్టారికల్ ఒప్పందం!
Advertisement

BrahMos Deal: భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య సంబంధాలు మరింత బలపడబోతున్నాయి. దీనికి కారణం మిడిల్ ఈస్ట్ వార్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ యుద్ధం తర్వాత తమ రక్షణ వ్యవస్థల విషయంలో అమెరికాపై ఎంతలా ఆధారపడ్డామో UAEకి అర్థమైంది. అదే సమయంలో అమెరికా మొఖం చాటేస్తే తమ పరిస్థితి అంతే అని UAEకి అర్థమైంది. ఇందుకోసం భారత్‌ అభివృద్ధి చేసిన బ్రహ్మోస్, ఆకాశ్ తీర్ క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది.

భారత్ సొంతంగా..

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి అయిన బ్రహ్మోస్‌ను కొనుగోలు చేయడానికి UAE ఇంట్రెస్ట్ చూపుతోందని తెలుస్తోంది. ఇది భారత్-రష్యాల ఉమ్మడి ప్రాజెక్ట్. అయితే రష్యా అనుమతి రావడం పెద్ద అడ్డంకి కాదనే నమ్మకంతో ఉంది UAE. బ్రహ్మోస్‌తో పాటు UAE ఫోకస్ చేసిన మరో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆకాశ్‌తీర్. ఇది భారత్ సొంతంగా డెవలప్‌ చేసిన ఫుల్లీ ఆటోమెటెడ్ ఎయిర్ డిఫెన్స్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్. దీనిని ఇండియన్‌ ఆర్మీతో కలిసి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది.

Advertisement

Aso read: ఇండియన్ మార్కెట్ లోకి స్కోడా కోడియాక్ RS ఎంట్రీ.. లిమిటెడ్ ఎడిషన్ బుకింగ్స్ షురూ!

కీలక ఒప్పందాలు..

ఇటీవల ఇరాన్‌తో జరిగిన యుద్ధం తర్వాత పరిస్థితులు మారిపోయాయి. యూఏఈ తన ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ను మరింత పటిష్టం చేసుకోవాలని చూస్తోంది. శత్రు దేశాల నుంచి వచ్చే మిసైల్స్‌, డ్రోన్ దాడులను తట్టుకోవడానికి భారత్ డెవలప్‌ చేసిన ఆకాశ్‌తీర్ వంటి ఆటోమేటెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ చాలా బెటర్ అనే ఆలోచనలో ఉంది UAE. ఇప్పటికే భారత్, UAE మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. ఇందులో అనేక వాణిజ్య ఒప్పందాలున్నాయి. అయితే ఈ ఒప్పందం వెనక మరో వ్యూహం కూడా ఉన్నట్టు కనిపిస్తోంది. రీసెంట్‌గా సౌదీ అరేబియా-పాకిస్తాన్ మధ్య కుదిరిన రక్షణ ఒప్పందాలకు కౌంటర్‌గా, గల్ఫ్ ప్రాంతంలో అత్యంత శక్తివంతమైన యూఏఈతో తన వ్యూహాత్మక, సైనిక భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకునేందుకు ఒక మంచి అవకాశం అనే చెప్పాలి.

అధికారిక ప్రకటన..

Advertisement

ఈ డీల్ విలువ 3.3 లక్షల కోట్లుగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఈ డీల్‌కు సంబంధించి ఇరు దేశాలు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఈ డీల్‌ కుదిరేందుకు చాలా అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మన ఆయుధాలకు ప్రపంచ మార్కెట్‌లో చాలా డిమాండ్ పెరిగింది. మన రక్షణ ఎగుమతులు గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 38 వేల400 కోట్లు దాటాయి. భారత్ తయారు చేసిన ఆయుధాలు నాణ్యమైనవనే నమ్మకం పెరిగింది. ఇది కూడా యూఏఈ భారత్ వైపు చూడటానికి కారణమనే చెప్పాలి.

Also read: Sai Baba: సనాతన ధర్మంలో కొత్త వివాదం.. కుండబద్దలు కొట్టిన మంత్రి ఆనం..!

Related News

కేసీఆర్‌ను కామెడీ పీస్‌ను చేసిండ్రు కదరా!? చావు నోట్లో తలపెట్టి.. డైలాగెందుకు వాడినట్టో…!? ఉద్యమాన్ని అవమానించడం కాదా?

DSC ఉద్యోగాల అమ్మకాలపై వైసీపీ సంచలన ఆధారాలు.. షాక్‌లో కూటమి సర్కార్!

పసికందుల విక్రయ దందా పై హైకోర్టు ఫైర్.. ఆ శాఖకు నోటీసులు జారీ?

దేశ రాజధానిలో ఘోరాతి ఘోరం.. 6 ఏళ్ల చిన్నారిని కూడా వదలని కిరాతకులు?

తెల్గు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం ఫామ్‌హౌజ్‌…! ఆ పదం రాసినందుకు ఇలేకరికి ఇచ్చిపడేసిన పెద్దసారు..!

క్రికెట్ చరిత్రలోనే హెచ్‌సీఏ చెత్త రికార్డు.. సోషల్ మీడియాలో పిచ్చ ట్రోల్స్!

పవర్‌ స్టేషన్స్‌ పరిశీలనకు 6 బృందాలు! థర్మల్‌ పవర్‌ స్టేషన్లలో ఏం జరుగుతోంది..? పరిశీలనకు రేపు ఆరు చోట్ల పర్యటనలు…

తెలంగాణలో మేఘాలయ మోడల్ వ్యవసాయ విధానం.. మోదట వేసే పంట ఇదే?

Big Stories

Advertisement
×