Telangana Govt: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి సోషల్‌మీడియా వేదికగా ప్రజలకు భావోద్వేగ పూరిత సందేశాన్ని ఇచ్చారు. ప్రజా ఆకాంక్షలు, అమరుల త్యాగాల ఆశయాలు ఇంధనంగా వెయ్యి రోజుల ప్రజా ప్రస్థానం కొనసాగిందని రాసుకొచ్చారు.
తెలంగాణలో జన ఆకాంక్షలే కేంద్రంగా.. త్యాగాల ఆశయాలే ఇంధనంగా సాగిన వెయ్యి రోజుల ప్రజా ప్రస్థానం ప్రత్యేకంగా రాసుకొచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి. పేదల అవసరాలను వారి ఆత్మగౌరవాలను మేళవించి సంక్షేమం అమలు చేస్తున్నట్లు వివరించారు. తెలంగాణ దీర్ఘకాలిక భవితను, యువత ఉపాధిని దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పథంలో పయనిస్తున్నట్లు తెలిపారు.
సకల వర్గాలకు సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పిస్తూ 1000 రోజుల పాలన ప్రయాణం సాగినట్టు రాసుకొచ్చారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆశీస్సులు, లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తల అండతో తెలంగాణను విశ్వ వేదికపై విజయపతాకగా నిలిపే వరకు ఈ కృషిని అవిశ్రాంతంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఈ ప్రయాణంలో తనకు తోడుగా, నీడగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మీతో ఈ అనుబంధం నా గుండెల్లో శాశ్వతంగా నిలిచి ఉంటుందని మనసులోని మాట బయటపెట్టారు సీఎం రేవంత్‌రెడ్డి.
ALSO READ: బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..