E-Paper
Advertisement

Mythri Movie: ఆ హీరోలకు హవాలా పేమెంట్స్!? మైత్రీ మూవీస్‌లో 700 కోట్ల విదేశీ పెట్టుబడులు?

Mythri Movie: ఆ హీరోలకు హవాలా పేమెంట్స్!? మైత్రీ మూవీస్‌లో 700 కోట్ల విదేశీ పెట్టుబడులు?
Advertisement
mythri-movie-makers

Mythri Movie: మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయం, నిర్మాతల ఇళ్లలో ఐటీ అధికారులు రోజుల తరబడి తనిఖీలు చేశారు. ఓ ప్రొడ్యూసర్ ఇంట్లో ఏముంటుంది? అంతగా ఏం చేశారనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇన్‌కమ్‌ట్యాక్స్ రైడ్‌లో పెద్ద డొంకే కదిలిందని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌కు ఏకంగా 700 కోట్లు విదేశాల నుంచి పెట్టుబడులుగా వచ్చినట్టు ఐటీ గుర్తించినట్టు సమాచారం. అదంతా బ్లాక్ మనీనే అనేది అనుమానం.

ఆ 700 కోట్లు ముందుగా ముంబైకి చెందిన ఓ కంపెనీకి బదిలీ అయ్యాయట. అక్కడి నుంచి ఆ సొమ్మును ఏడు కంపెనీలకు తరలించారట. వాటి నుంచి మైత్రీ మూవీ మేకర్స్‌లోకి వేరువేరుగా పెట్టుబడుల రూపంలో వైట్ మనీగా చూపించే ప్రయత్నం చేశారని ఐటీ తనిఖీల్లో తేలిందని అంటున్నారు.

Advertisement

ఇటీవల బాలీవుడ్ టాప్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్‌, ప్రభాస్‌ల కాంబినేషన్‌లో పాన్ ఇండియా సినిమా తీసేందుకు మైత్రీ మూవీస్ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ దర్శకుడికి ఏకంగా 150 కోట్లు అడ్వాన్స్‌గా చెల్లించింది. ఆ సొమ్మంతా హవాలా రూపంలోనే ఇచ్చారని ఐటీ దర్యాప్తులో వెల్లడైనట్టు తెలుస్తోంది.

ఈ ఐటీ రైడ్స్ టాలీవుడ్ హీరోలను సైతం షేక్ చేస్తోంది. ఇటీవల మైత్రీ బ్యానర్‌లో నటించిన పలువురు హీరోలను సైతం రెమ్యునరేషన్ సొమ్మును హవాలా మార్గంలోనే ముట్టజెప్పినట్టు ఐటీ చెబుతోంది. లేటెస్ట్ సీక్వెల్ మూవీ హీరోతో పాటు.. గత రెండేళ్లలో ఇద్దరు టాప్ హీరోలకు సైతం అనుమానాస్పద రీతిలో చెల్లింపులు జరిపినట్లు ఐటీ అధికారులు గుర్తించారని తెలుస్తోంది. ఆ హీరోల ఆర్థిక లావాదేవీలనూ పరిశీలించేందుకు ఐటీ రెడీ అవుతున్నట్టు సమాచారం. అదే జరిగితే టాలీవుడ్‌లో సంచలనమే. బహుషా అందుకే కావొచ్చు.. ఐటీ రైడ్స్‌కు బేజారై.. మైత్రీ నిర్మాత హాస్పిటల్‌లో చేరాల్సి వచ్చిందంటున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×