E-Paper
Advertisement

Khammam : మిర్చి దొంగలు.. అర్ధరాత్రి కల్లంలో పంట చోరి..

Khammam : మిర్చి దొంగలు.. అర్ధరాత్రి కల్లంలో పంట చోరి..
Advertisement

Khammam : రైతు పంట వేసిన తర్వాత ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటాడు. అకాలవర్షం వల్ల పంటలకు నష్టవాటిల్లుతుంది. పంటకు తెగుళ్లు సోకడం వల్ల అనుకున్నదాని కంటే తక్కువ దిగుబడి వస్తుంది. ఇలా రైతు ఏదో ఒక కారణంతో పంట నష్ట పోతాడు. ఖమ్మం జిల్లాలోనూ ఓ రైతుకు పంట చేతికి వచ్చింది కాని నోటికి అందలేదు.

వైరా మండలంలో శాంతినగర్ గ్రామానికి చెందిన కొల్లి నరసింహారావు అనే రైతు గ్రామంలో పది ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని మిర్చి ,మొక్కజొన్న పంటలు సాగు చేశారు. రెండు ఎకరాల్లో సాగు చేసిన మిర్చి పంటను కోసి పక్కనే ఉన్న వెంచర్ లో ఎండబోశారు.

Advertisement

ఎండిన మిర్చిని కుప్ప వేసి ఉంచారు. అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు తొమ్మిది క్వింటాళ్ల మిర్చిని వాహనంలో ఎత్తుకెళ్లారు. తెల్లవారు జామున మిర్చి కల్లం దగ్గరికి రైతు వెళ్లి చూశాడు. మిర్చి చోరీకి గురైందని గుర్తించి వైరా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సుమారు రెండు లక్షల విలువైన మిర్చి చోరీకి గురైందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×