E-Paper
Advertisement

Rajendra Nagar : ప్రాణం తీసిన పతంగి.. ఓ కుటుంబంలో తీవ్ర విషాదం

Rajendra Nagar : ప్రాణం తీసిన పతంగి.. ఓ కుటుంబంలో తీవ్ర విషాదం
Advertisement

Rajendra Nagar : సంక్రాంతి పండుగ సెలవుల్లో ఓ కుటుంబంలో తీరని విషాద ఛాయలు అలుముకున్నాయి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని అత్తాపూర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌తో 11 ఏళ్ల బాలుడు తనిష్క్ మృతిచెందాడు.

సంక్రాంతి సెలవులు కావడంతో గాలి పటాలు ఎగుర వేయడానికి తన ముగ్గురు స్నేహితుల తో కలిసి మిద్దె మీదకు వెళ్లాడు. ఈ క్రమంలో గాలిపటం విద్యుత్ వైర్లకు తగిలి కరెంట్ షాక్‌తో బాలుడు అక్కడే కుప్పకూలిపోయాడు. తల్లిదండ్రులు హుటాహుటిన తనిష్క్ ను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందాడని వైద్యలు ధృవీకరించారు.

Advertisement

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాలిపటం ఎగురవేసేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని స్థానిక పిల్లలకు సూచించారు. సెలవుల్లో పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని పోలీసులు తల్లిదండ్రులను హెచ్చరించారు. తమ గారాల పట్టి.. ఇక కనిపించడని తెలిసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×