Mancherial district: దంపతుల మధ్య చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి. తీవ్రరూపం దాల్చకుండా ముందే పరిష్కరించుకుంటే బెటర్. ఏ మాత్రం జఠిలమైన అనేక అనర్థాలకు దారి తీస్తాయి. అలాంటి ఘటన ఒకటి మంచిర్యాల జిల్లాలో వెలుగు చూసింది. భార్యభర్తల మధ్య గొడవలో భార్య ముక్కు కొరికేశాడు ఆమె భర్త. ప్రస్తుతం బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అసలు ఏం జరిగింది?
పోలీసుల వివరాల ప్రకారం..మంచిర్యాల జిల్లా కోటపల్లి ప్రాంతానికి చెందిన మమత-మల్లంపేటకు చెందిన మణిచందర్‌తో పెళ్లి జరిగింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. హాయిగా సాగుతున్న వీళ్ల సంసారంలోకి చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి. గడిచిన నాలుగేళ్లుగా అదనపు కట్నం తేవాలని భార్యని వేధిస్తున్నాడు భర్త మణిచందర్. ఈ క్రమంలో తరచూ భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మద్యానికి బానిసై కట్నం విషయంలో గొడవ చేసేవాడు భర్త. 10 రోజుల కిందట భార్యభర్తల మధ్య మళ్లీ గొడవ జరిగింది.
పట్టరాని కోపంతో మమత పిల్లలతో కలిసి తన తల్లిదండ్రుల దగ్గరకు వచ్చింది. పరిస్థితి గమనించిన మణిచందర్, తన కుటుంబ సభ్యులతో కోటపల్లికి వచ్చాడు. ఇరు కుటుంబాలు.. మమత-మణిచందర్ మధ్య మాటల వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో మమత తండ్రి నారాయణపై దాడి చేయాడు మణిచందర్. కాపాడే ప్రయత్నంలో అడ్డుగా వెళ్లిన భార్య ముక్కు బలంగా కొరకడంతో తీవ్ర గాయమైంది. ముక్కు నుంచి రక్తం కారడంతో వెంటనే వెంటనే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన గురించి మమత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఎస్సై, విచారణ చేపట్టారు.
ALSO READ: ట్రాఫిక్‌కు చెక్.. హైదరాబాద్ సిటీ చుట్టూ నాలుగు బస్సు టెర్మినల్స్, ఎక్కడెక్కడంటే