E-Paper
Advertisement

సుడిగాలి సుధీర్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

సుడిగాలి సుధీర్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Advertisement

Sudigali Sudheer:బుల్లితెరపై తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న సుధీర్ (Sudheer) గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. జబర్దస్త్ లో తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో కోట్లాదిమంది ప్రేక్షకుల హృదయాలను సొంతం చేసుకున్న సుధీర్.. అదే క్రేజ్ తో సినిమాలలోకి కూడా అడుగు పెట్టారు. సినిమాలు చేశారు కానీ అనుకున్నంత స్థాయిలో వర్కౌట్ కాలేదు. దీంతో మళ్లీ బుల్లితెర పైకి రీఎంట్రీ ఇచ్చారు. ముఖ్యంగా బుల్లితెరపై మేల్ యాంకర్ ప్రదీప్ కి కూడా పోటీ ఇస్తూ.. ఊహించని రేంజ్ లో డిమాండ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం ది ఫ్యామిలి స్టార్స్ 2, సరిగమప వంటి షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఇక క్షణం తీరిక లేకుండా వరుసగా షోల మీద షోలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయారు. ఈ నేపథ్యంలోనే సుధీర్ రెమ్యూనరేషన్ విషయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

సుధీర్ రెమ్యూనరేషన్..

ప్రముఖ టీవీ ఛానల్ జీ తెలుగు వేదికగా డ్రామా జూనియర్స్ సీజన్ ను పూర్తి చేసిన సుధీర్.. ఇప్పుడు సరిగమప షో కూడా చేస్తున్నారు. డ్రామా జూనియర్స్ ఒక్కో ఎపిసోడ్ కి సుమారుగా రూ.5 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. నిజానికి ది ఫ్యామిలీ స్టార్స్ 2 కి కూడా సుధీర్ ఇదే రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఏది ఏమైనా బుల్లితెరపై అత్యధికమైన రెమ్యూనరేషన్ తీసుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు సుధీర్. ఒకవేళ సినిమాలలో గనుక ఈయనకు రెండు మూడు హిట్స్ పడ్డాయి అంటే కచ్చితంగా ఈయన రేంజ్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఏది ఏమైనా సుధీర్ రెమ్యూనరేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సుధీర్ కెరియర్..

Advertisement

జబర్దస్త్ షోలోకి స్క్రిప్ట్ రైటర్ గా అడుగుపెట్టి, ఆ తర్వాత కమెడియన్ గా పెర్ఫార్మ్ చేసి ఏకంగా టీం లీడర్ గా ఎదిగి సత్తా చాటారు. ముఖ్యంగా తన స్నేహితులు ఆటో రాంప్రసాద్ (Auto Ram Prasad), గెటప్ శ్రీను (Getup Srinu)లతో కలిసి చేసిన వందలాది స్కిట్లు ఊహించని విజయాన్ని సొంతం చేసుకున్నాయి . ముఖ్యంగా మంచి టిఆర్పి రేటింగ్ కూడా అందించాయి. జబర్దస్త్ లో చేస్తూనే.. ఎక్స్ట్రా జబర్దస్త్, పోవే పోరా, ఢీ డ్యాన్స్ షో వంటి షో లలో సందడి చేశాడు. 2018 సంవత్సరానికి గాను హైదరాబాదు టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ ఆన్ టీవీ జాబితాలో 13వ స్థానాన్ని కూడా సంపాదించుకున్నారు.

ALSO READ:దేబ్జానీ.. ముఖేష్ తో ప్రేమ నిజమేనా?

సుధీర్ సినిమాలు..

Advertisement

2016లో సర్దార్ గబ్బర్ సింగ్, బంతిపూల జానకి , వేర్ ఈజ్ విద్యాబాలన్, పులి, అడ్డా, రేసుగుర్రం, నేను శైలజ, సెల్ఫీరాజా, ఓం నమో వెంకటేశాయ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి చిత్రాలలో సహాయక పాత్రలు పోషించిన ఈయన.. ఆ తర్వాత జాక్ పార్ట్ 2 షోలో నాలుగు ఎపిసోడ్లకు హోస్టుగా వ్యవహరించారు. ఆ తర్వాత సాఫ్ట్వేర్ సుధీర్ చిత్రంతో హీరోగా అరంగేట్రం చేశారు. కానీ ఈ సినిమాకి మిశ్రమ ఫలితం లభించింది. ఆ తర్వాత తన స్నేహితులతో కలిసి త్రీ మంకీస్ అనే చిత్రం చేశారు. ఆ తర్వాత వచ్చిన గాలోడు చిత్రం కూడా మిశ్రమ స్పందన సొంతం చేసుకుంది. ప్రస్తుతం గోట్ అనే చిత్రంలో నటిస్తున్నాడు.

Related News

దేబ్జానీ.. ముఖేష్ తో ప్రేమ నిజమేనా?

Gundeninda Gudigantalu Neethu : నీతూ ఇన్ని రోజులు ఏమైంది..? అసలు మ్యాటర్ ఇదేనా..?

ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది.. కానీ- ఉదయభాను

బిగ్ బాస్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్న చరణ్, చైత్ర.. వీడియో వైరల్!

పెద్దోడి డెడికేషన్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. వీడియో వైరల్..

Nindu Noorella Saavasam Serial Today Episode September 16th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మలో ప్రవేశించనున్న ఆరు ఆత్మ..?  

Gundeninda GudiGantalu Today episode: సుమతి హెల్ఫ్ తో మీనా హ్యాపీ.. భర్తకు సేవలు చేసిన రోహిణి.. ప్రభా దెబ్బకు షాక్..

Big Stories

Advertisement
×