E-Paper
Advertisement

కేసీఆర్ చిటికె వేస్తే కాంగ్రెస్ నాయకులు ఊళ్లలో తిరగలేరు: జీవన్ రెడ్డి

కేసీఆర్ చిటికె వేస్తే కాంగ్రెస్ నాయకులు ఊళ్లలో తిరగలేరు: జీవన్ రెడ్డి
Advertisement

Jeevan Reddy: స్వేచ్ఛ బ్యూరో: కాగ్రేస్ ది ప్రజాపాలన కాదని, పోలీస్ పాలన అని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. మంగళవారం బీఆర్ఎస్ భవన్ లో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలీసు పాలన కొనసాగుతుందని, ఇందుకు వరసగా జరుగుతున్న దురాగతాలు రుజువు చేస్తున్నాయన్నారు. ఇందిరమ్మ రాజ్యం కాదని, ఇదేమి రాజ్యమని ప్రజలు చర్చించుకునే పరిస్థితి వచ్చిందన్నారు.

కేసీఆర్ ఇంటిపై దాడి కుట్ర!

Advertisement

సీఎం స్వయంగా రాష్ట్ర సాధకుడు ,తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత కేసీఆర్ ఇంటిపై దాడికి ఉసి గొల్పారని ఆరోపించారు. గతం లోనే గజ్వెల్ లో కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుపై రేవంత్ దాడి చేయించిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. సిరిసిల్లలో కేటీఆర్ క్యాంపు ఆఫీసుపై దాడి, సిద్దిపేటలో హరీష్ రావు క్యాంపు ఆఫీసుపై కూడా దాడి చేసింది కాంగ్రెస్ నేతలేనని ఆయన ఆరోపించారు. కేటీఆర్ పీఆర్వో, పీఏలను సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో విచారణ పేరుతో ఇబ్బందులు పెట్టారని, రాష్ట్రంలో హింసాత్మక రౌడీ పాలన సాగుతోందన్నారు. 30 వేల మంది బూత్ ఏజెంట్లకు కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసులు ఇచ్చిందని, ముసుగులు వేసుకుని పోలీస్ స్టేషన్ పై దాడికి పాల్పడ్డారన్నారు.

ఊళ్లలో తిరగలేరు… జాగ్రత్త! 

Advertisement

కేసీఆర్ చిటికె వేస్తే సీఎం, మంత్రులు,కాంగ్రెస్ వాళ్లు ఊర్లలో తిరగలేరని, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తోందన్నారు. పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారని ఆరోపించారు. అతి చేస్తున్న అధికారుల పేర్లు పింక్ బుక్ లో ఎక్కుతున్నాయన్నారు. కేసీఆర్ కుటుంబంపై కుట్రలు చేస్తే తెలంగాణ అగ్ని గుండమవుతుందని, రాష్ట్రంలో ఇందిరమ్మ ఎమర్జెన్సీ కొనసాగుతోందన్నారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ దళితులతో దాడులు చేయిస్తామంటున్నారన్నారు. దళితులతో కేటీఆర్ పై దాడి చేయడానికి దళితులు ఏమైనా నీకు బానిసలా అని ప్రశ్నించారు.

Also Read: తిరుమల బ్రహ్మోత్సవాలు.. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

Tags

Related News

వినాయక నిమజ్జనానికి డీజే పెడుతున్నారా.. అయితే మీకో షాకింగ్ న్యూస్!

చేయూత పింఛన్ అప్లై చేసుకోలేదా.. సాయంత్రం 5 గంటల వరకే లాస్ట్ ఛాన్స్!

మెదక్ జిల్లాలో మైండ్ బ్లాక్ అయ్యే న్యూస్.. 3 ఎకరాల రైతు ఖాతాలో 3,850 ఎకరాల భూమి?

ఇందిరమ్మ ఇండ్లు అప్లికేషన్ బిగ్ అప్డేట్.. లాస్ట్ డేట్ పొడిగింపు!

తల్లి కాంగ్రెస్‌నే ఎదిరించాం.. ఈ పిల్ల కాంగ్రెస్ ఓ లెక్కా? రేవంత్ సర్కార్‌పై కవిత ఫైర్!

ఎంపీడీవో, ఆర్‌ఐపై భద్రాద్రి జిల్లా కలెక్టర్ ఫైర్.. చర్యలు తీసుకోవాలని ఆదేశం!

అధికారులు కాదు.. తప్పు చేసిందే ప్రభుత్వం.. 22A వివాదంపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×