E-Paper
Advertisement

ఇందిరమ్మ ఇండ్లు అప్లికేషన్ బిగ్ అప్డేట్.. లాస్ట్ డేట్ పొడిగింపు!

ఇందిరమ్మ ఇండ్లు అప్లికేషన్ బిగ్ అప్డేట్.. లాస్ట్ డేట్ పొడిగింపు!
Advertisement

Indiramma Towers: హైదరాబాద్‌ క్యూర్ పరిధిలోని ప్రజల సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ పథకం కింద నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ గడువును 20 సెప్టెంబర్ 2026 వరకు పొడిగించారు. రెండో శనివారం, ఆదివారం, పండుగలు , ఇతర వరుస సెలవుల కారణంగా దరఖాస్తుల గడువును పొడిగించాలని వివిధ వర్గాల నుంచి విజ్ఞప్తులు అందాయి. వాటిని పరిశీలించిన అనంతరం దరఖాస్తుల స్వీకరణ గడువును సెప్టెంబర్ 20 వరకు పొడిగించాలని నిర్ణయించినట్లు తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ గౌతమ్ తెలిపారు.

తేదీ పొడిగింపు..

ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ పథకంలో భాగంగా తొలుత 16 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి దరఖాస్తులను స్వీకరించి, లాటరీ ద్వారా ఇండ్ల కేటాయింపు ప్రక్రియను కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం మరో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలైన చాంద్రాయణగుట్ట, ఎల్‌బీ నగర్, ముషీరాబాద్ మరియు గోషామహల్ పరిధిలో నిర్మించనున్న టవర్లలోని ఇండ్ల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ ముగిసినప్పటికీ ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, వరుస సెలవులు మరియు పండుగలను దృష్టిలో ఉంచుకొని గడువును 20సెప్టెంబర్ 2026 వరకు పొడిగించినట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisement

Also read: 45 ఏళ్ల క్రితం నాటి దొంగను పట్టించిన ఏఐ ఫోటో.. ఎలానో తెలిస్తే మీరు షాకవ్వడం కాయం!

తెలంగాణకు 2 లక్షల ఇళ్లు..

సంబంధిత నాలుగు నియోజకవర్గాల ప్రజలు ఈ పొడిగించిన గడువును సద్వినియోగం చేసుకొని, సెప్టెంబర్ 20లోగా తమ దరఖాస్తులను సమర్పించాలన్నారు. పథకానికి సంబంధించిన అర్హత ప్రమాణాలు మరియు ఇతర నిబంధనల్లో ఎటువంటి మార్పు లేదని ఆయన స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు tghb.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. లేదా తెలంగాణ హౌసింగ్ బోర్డు కాల్ సెంటర్ నంబర్ 040-24603572ను సంప్రదించవచ్చని ఆయన చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ కు రెండు లక్షల ఇళ్లను కేటాయిస్తున్నట్లుకేంద్రం ప్రకటించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు లేని నిరుపేద కుటుంబాలకు ఈ ఇళ్లను అందజేస్తున్నట్లు తెలిపింది.

Advertisement

Also read: అటకెక్కిన ఫైలు కిందికి దిగింది.. రాజీవ్‌ యువ వికాసం దరఖాస్తుల దుమ్ము దులుపుతున్న సర్కార్‌..!

Tags

Related News

తల్లి కాంగ్రెస్‌నే ఎదిరించాం.. ఈ పిల్ల కాంగ్రెస్ ఓ లెక్కా? రేవంత్ సర్కార్‌పై కవిత ఫైర్!

ఎంపీడీవో, ఆర్‌ఐపై భద్రాద్రి జిల్లా కలెక్టర్ ఫైర్.. చర్యలు తీసుకోవాలని ఆదేశం!

అధికారులు కాదు.. తప్పు చేసిందే ప్రభుత్వం.. 22A వివాదంపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్‌లో సీఎం సీటు రగడ.. తెలంగాణ మరో బంగ్లాదేశ్ కాబోతోంది.. బండి సంజయ్ హాట్ కామెంట్స్!

ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

పోలీసుల నిర్లక్ష్యానికి యువకుడు బలి.. న్యాయం జరగక బాధితుడి ఆత్మహత్య!

మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్.. లొంగిపోయిన సీనియర్ మావోయిస్టు?

Big Stories

Advertisement
×