E-Paper
Advertisement

కర్ణాటక నుంచి నైరుతి బంగాళాఖాతం వరకు.. రానున్న మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు

కర్ణాటక నుంచి నైరుతి బంగాళాఖాతం వరకు.. రానున్న మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు
Advertisement

Rain Alert In Telangana: అసలు వర్షాలు లేక అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు చల్లని కబురు చెప్పింది హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం. సెప్టెంబరు 19 నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాన కబురు తెలియగానే రైతులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

కర్ణాటక నుంచి నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి ప్రభావం

తెలంగాణకు చల్లటి కబురు చెప్పింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. కర్ణాటక నుంచి నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి ఏర్పడింది. దీని కారణంగా మంగళవారం నుంచి తమిళనాడు మీదుగా మన్నార్‌ గల్ఫ్‌ వరకు అది కాస్త విస్తరించింది. ఫలితంగా వర్షాలు పడే అవకాశముంది. సెప్టెంబరు 19 నుంచి మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తేల్చిచెప్పింది. 19న ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు అంచనా వేసింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. మరుసటి రోజు అనగా 20, 21న పలు ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడనున్నాయి. బుధ, గురువారాల్లో తెలంగాణవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

రానున్న మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు

Advertisement

సెప్టెంబరు తొలి రెండువారాలు తెలంగాణలో ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు. కేవలం 61 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ సీజన్‌లో సాధారణ వర్షపాతం 86 మిల్లీ మీటర్లు కాగా, ఇంకా 28 శాతం లోటు ఏర్పడింది. గతేడాది ఈ సీజన్‌లో 117 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. రుతుపవనాలు వచ్చిన జూన్‌ ఒకటి నుంచి ఇప్పటి వరకు 659 మి.మీ. వర్షపాతం నమోదు కావాలి. ప్రస్తుతానికి 535 మిల్లీమీటర్లు నమోదు అయ్యింది. ప్రస్తుత సీజన్‌లో 19 శాతం వర్షపాతం లోటు నమోదైంది.

తెలంగాణలో భారీ వర్షపాతం లోటు నమోదు

జూన్‌-11.74 శాతం, జులై-1.36, ఆగస్టు-37.67 శాతం లోటు నమోదు అయ్యింది. ఇక సెప్టెంబరులో రెండువారాలకు 29 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అధిక లోటు వర్షపాతం నమోదు అయ్యింది. అందులో జోగులాంబ జిల్లా- 45.42 శాతం, హనుమకొండ-41.91 శాతం, వనపర్తి- 40.70 శాతం, నాగర్‌కర్నూల్‌-38.67 శాతం, నారాయణపేట-37.42 శాతం లోటు ఉంది. మరి ఈసారైనా వర్షాలు తెలంగాణ అంతా భారీగా పడతాయా? లేదా అనేది చూడాలి.

Advertisement

ALSO READ: వినాయక నిమజ్జనానికి డీజే పెడుతున్నారా.. అయితే మీకో షాకింగ్ న్యూస్!

Related News

వినాయక నిమజ్జనానికి డీజే పెడుతున్నారా.. అయితే మీకో షాకింగ్ న్యూస్!

కేసీఆర్ చిటికె వేస్తే కాంగ్రెస్ నాయకులు ఊళ్లలో తిరగలేరు: జీవన్ రెడ్డి

చేయూత పింఛన్ అప్లై చేసుకోలేదా.. సాయంత్రం 5 గంటల వరకే లాస్ట్ ఛాన్స్!

మెదక్ జిల్లాలో మైండ్ బ్లాక్ అయ్యే న్యూస్.. 3 ఎకరాల రైతు ఖాతాలో 3,850 ఎకరాల భూమి?

ఇందిరమ్మ ఇండ్లు అప్లికేషన్ బిగ్ అప్డేట్.. లాస్ట్ డేట్ పొడిగింపు!

తల్లి కాంగ్రెస్‌నే ఎదిరించాం.. ఈ పిల్ల కాంగ్రెస్ ఓ లెక్కా? రేవంత్ సర్కార్‌పై కవిత ఫైర్!

ఎంపీడీవో, ఆర్‌ఐపై భద్రాద్రి జిల్లా కలెక్టర్ ఫైర్.. చర్యలు తీసుకోవాలని ఆదేశం!

Big Stories

Advertisement
×