E-Paper
Advertisement

చిన్నారి మృతి.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన నటి పూర్ణ!

చిన్నారి మృతి.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన నటి పూర్ణ!
Advertisement

Actress Poorna: ప్రముఖ నటి పూర్ణ (Poorna) ఒకప్పుడు వరుస చిత్రాలలో నటించి, భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. సెకండ్ ఇన్నింగ్స్ లో స్పెషల్ సాంగ్ లతో ఆడిపాడుతున్న విషయం తెలిసిందే. అంతేకాదు బుల్లితెర షోలలో అప్పుడప్పుడు దర్శనమిస్తూ జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది. ఇకపోతే పెళ్లి జరిగి, పిల్లలు పుట్టిన తర్వాత సినిమాలు బాగా తగ్గించేసిన ఈమె.. తన వైవాహిక జీవితంలో బిజీగా మారిపోయింది..

చిన్నారి మృతి.. పూర్ణ ఎమోషనల్ పోస్ట్..

ఇదిలా ఉండగా తాజాగా ఒక చిన్నారి మృతిపై కన్నీళ్లు పెట్టుకుంటూ పూర్ణ చేసిన ఎమోషనల్ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విషయంలోకి వెళ్తే.. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు భార్యగా, కోడలిగా, తల్లిగా బిజీగా ఉన్న ఈమె మరొకవైపు క్లాసికల్ డాన్స్ లో నిపుణురాలుగా పేరు తెచ్చుకుంది. పైగా ఒక డ్యాన్స్ స్టూడియోని కూడా నడుపుతోంది. షమ్నా ఖాసిం డ్యాన్స్ స్టూడియో పేరుతో నిర్వహిస్తున్న ఈ డ్యాన్స్ స్కూల్లో ఎంతోమంది చిన్నారులు డ్యాన్స్ నేర్చుకుంన్నారు. ముఖ్యంగా పూర్ణ స్వయంగా పిల్లలకు డ్యాన్స్ నేర్పిస్తోంది. ఒక పాప చనిపోయింది. దీంతో పూర్ణ కన్నీటి పర్యంతం అవుతూ.. తన స్టూడెంట్ కు నివాళి అర్పిస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్టు పెట్టింది.

నీ స్థానం భర్తీ చేయలేనిది – పూర్ణ

Advertisement

కొన్ని వీడ్కోళ్లు మాటలకు కూడా అందవు. ముఖ్యంగా కన్నీళ్లు కూడా పూర్తిగా వ్యక్తపరచలేని బాధ మాత్రమే గుండెల్లో ఉంటుంది. ఈ చిన్న దేవదూత మా షమ్నా ఖాసిం స్టూడియోకి ప్రియమైన విద్యార్థిని కూడా. నాట్యం నేర్చుకోవడానికి నువ్వు వేసిన చిన్ని అడుగులు, నీ అమాయకపు చిరునవ్వు , నీ ప్రియమైన ముఖం, మా స్టూడియోలోని ప్రతి మూలలో ఎప్పటికీ నిలిచి ఉంటాయి. నువ్వు మాకు కేవలం ఒక విద్యార్థిని మాత్రమే కాదు.. నువ్వు మా కుటుంబంలో ఒక అమూల్యమైన సభ్యురాలు కూడా.. నువ్వు వదిలి వెళ్ళిన ఈ శూన్యాన్ని మరెవరు పూరించలేరు. నేను, ఈ స్టూడియో ఉన్నంతకాలం నువ్వు మా హృదయాలలో, జ్ఞాపకాలలో శ్వాసతంగా నిలిచిపోతావు. నీ జ్ఞాపకాలు ఎప్పటికీ చెరిగిపోవు. నీ అందమైన చిరునవ్వు ఎప్పటికీ దూరం కాదు. భరించలేని బాధతో నీకు వీడ్కోలు పలుకుతున్నాము. మా హృదయపూర్వక సంతాపం అంటూ కన్నీటి నివాళులు సమర్పించింది పూర్ణ. అయితే చిన్నారి మరణించింది అన్న విషయాన్ని ఆమె చెప్పింది కానీ ఆ చిన్నారికి ఏం జరిగింది? ఎందుకు చనిపోయింది ? అనే విషయంపై మాత్రం పూర్ణ క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

ALSO READ: సుడిగాలి సుధీర్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

పూర్ణ కెరియర్..

Advertisement

పూర్ణ విషయానికి వస్తే.. చివరిగా గత ఏడాది రిలీజ్ అయిన అఖండ 2 సినిమాలో కనిపించిన ఈమె.. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా నటిస్తున్న జైలర్ మూవీ సీక్వెల్ జైలర్ 2 లో స్పెషల్ సాంగ్ చేసింది. ఇప్పటికే ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా పూర్ణ స్టూడియోలో పాప చనిపోవడం నిజంగా బాధాకరం అనే చెప్పాలి. మరి ఆ పాప మరణానికి గల కారణాన్ని పూర్ణ వెల్లడిస్తుందో లేదో తెలియాల్సి ఉంది.

Related News

10 ఏళ్ల తర్వాత పెళ్లి పీటలెక్కిన నటి అహానా కృష్ణ.. వరుడు ఎవరంటే?

Suriya – Jyotika: 20 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. ఇది అస్సలు ఊహించలేదు మావా..!

సాయి పల్లవి కోసం.. ‘రామాయణ్’ సాంగ్‌లో ఆ నటిని బ్లర్ చేశారా?

ఫాహ్.. ఈ ఫన్నీ సౌండ్‌కు స్ఫూర్తి కమెడియన్ వేణు మాధవ్?

ఎమ్మెస్ సుబ్బలక్ష్మిగా రష్మిక..ఆమె ఫస్ట్ రియాక్షన్ ఇదే!

విడాకుల వార్తలకు చెక్ పెట్టిన కియారా సిద్దార్థ్ మల్హోత్రా!

పూర్తి అబ్బాయిగా మారిన స్నిగ్ధ.. గర్ల్ ఫ్రెండ్ కూడా?

Big Stories

Advertisement
×