E-Paper
Advertisement

రోడ్డు దాటుతుండగా దూసుకొచ్చిన కారు.. గాల్లోకి ఎరిగిన వ్యక్తి, హిట్ అండ్ రన్‌లో షాకింగ్ దృశ్యాలు

రోడ్డు దాటుతుండగా దూసుకొచ్చిన కారు.. గాల్లోకి ఎరిగిన వ్యక్తి, హిట్ అండ్ రన్‌లో షాకింగ్ దృశ్యాలు
Advertisement

Noida: దేశంలో ఈ మధ్య ఎటుచూసినా హిట్ అండ్ రన్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. అవి ఏ ప్రాంతానికి పరిమితం కాలేదు. వాహనదారుల అతి వేగం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. తాజాగా గ్రేటర్ నోయిడాలో రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. అసలు ఏం జరిగింది?

ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో మరో హిట్ అండ్ రన్ ఘటన

ప్రాణం పోవడానికి ఒక్క నిమిషం చాలు. అలాంటిది ఒక వ్యక్తిని కాపాడటానికి రోజులు, నెలలు, ఏళ్లు పడతాయి. కొంతమంది యువకులు వాహనాలతో రోడ్లపై ఇష్టాను సారంగా రెచ్చిపోతున్నారు. ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా గ్రేటర్ నోయిడాలో రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ఘటనకు సంబంధించి ఒక సీసీటీవీ ఫుటేజ్ బయటపడింది. అందులో కారు తనవైపు రావడాన్ని గమనించిన ఆ వ్యక్తి, వెనక్కి జరుగుతున్నట్లు కనిపిస్తోంది. అయినప్పటికీ ఆ కారు అతడి వైపు దూసుకొచ్చినట్టు ఫుటేజ్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.

రోడ్డు దాటుతుండగా వ్యక్తిపైకి దూసుకొచ్చిన కారు, CCTVలో షాకింగ్ దృశ్యాలు

Advertisement

ఆ వ్యక్తి గాలిల్లోకి ఎగిరిపడ్డాడు. ఫలితంగా అతడి పలు ఫ్రాక్చర్లు అయ్యాయి. ఈ దిగ్భ్రాంతికరమైన హిట్-అండ్-రన్ ఘటన సీసీటీవీలో రికార్డయింది. ఆ వ్యక్తి రెండు కాళ్లు, చేతులు, మోకాలు, వెన్నెముకకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో డ్రైవర్‌ను అరెస్టు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మూడురోజుల కిందట గురుగ్రామ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై ఆ తరహా ఘటన జరిగింది. వేగంగా వచ్చిన ఓ కారు మహిళా బైకర్‌ని ఢీ కొట్టిన విషయం తెల్సిందే. ఈ ఘటన జరిగిన కొద్దిరోజులకే అలాంటిది మరొకటి చోటుచేసుకుంది.

ALSO READ: రైల్వే జాబ్స్.. 7వ పే కమిషన్ జీతంతో 560 ఉద్యోగాలు

Advertisement

 

Related News

రైల్వే జాబ్స్.. 7వ పే కమిషన్ జీతంతో 560 ఉద్యోగాలు

45 ఏళ్ల క్రితం నాటి దొంగను పట్టించిన ఏఐ ఫోటో.. ఎలానో తెలిస్తే మీరు షాకవ్వడం కాయం!

ప్రధాని మోదీ జన్మదిన వేళ ఎంపీ డీకే అరుణ సంచలన పిలుపు!

యూపీఐ ఉచిత సేవలకి ఎండ్ కార్డ్? మోదీ సర్కార్ నిర్ణయంపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు!

24 క్యారెట్ల బంగారు పూతతో.. గణపయ్యకు కుడుములు.. కేజీ ఏకంగా రూ.27,000 బాబోయ్!

డిజిటల్ చెల్లింపులపై కొత్త టాక్స్.. సామాన్యుడికి మోదీ సర్కార్ దెబ్బ!

ఓ వైపు చీప్ పబ్లిసిటీ.. మరోవైపు ఘనంగా వేడుకలు.. తమిళనాట గణేశ్ ఉత్సవాలు అదరహో!

Big Stories

Advertisement
×