E-Paper
Advertisement

Revanthreddy : మాది తోడికోడళ్ల పంచాయితీ.. రేవంత్‌ – జగ్గారెడ్డి మధ్య ఆసక్తికర సన్నివేశం..

Revanthreddy : మాది తోడికోడళ్ల పంచాయితీ.. రేవంత్‌ – జగ్గారెడ్డి మధ్య ఆసక్తికర సన్నివేశం..
Advertisement

Revanthreddy : టీకాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పట్లో టీపీసీసీ చీఫ్ పదవి నుంచి రేవంత్ రెడ్డిని దింపడం ఎవరి వల్లా సాధ్యం కాదని స్పష్టం చేశారు. సీఎల్పీ కార్యాలయంలో ధరణి, భూ సమస్యలపై కాంగ్రెస్ ముఖ్యనేతలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వస్తున్న సమయంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి అసెంబ్లీ ఆవరణలో ఎదురుపడ్డారు. సీఎల్పీ కార్యాలయంలోకి ఇద్దరూ కలిసి వెళ్లారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. ఈ విషయంపై మీడియా ప్రశ్నిస్తుండగానే.. రేవంత్ రెడ్డి స్పందించారు. జగ్గారెడ్డికి, తనకు మధ్య జరిగేది తోడికోడళ్ల పంచాయితీ అని తెలిపారు. ఇద్దరం కాంగ్రెస్ నేతలమని, పొద్దున తిట్టుకుంటాం.. మళ్లీ కలిసిపోతామంటూ చెప్పుకొచ్చారు.

Advertisement

అనంతరం జగ్గారెడ్డి మాట్లాడారు. తాను టీపీసీసీ చీఫ్ పదవి ఆశిస్తున్నానని తెలిపారు. రేవంత్ రెడ్డి దిగిన తర్వాతే అది సాధ్యమవుతుందన్నారు. తన కోరిక నెరవేరడానికి పదేళ్లైనా పడుతుందన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ పాదయాత్రకు తన మద్దతుపై త్వరలో ప్రకటన చేస్తానన్నారు. అనంతరం ఏఐసీసీ నేత కొప్పుల రాజు, మాజీ మంత్రి దామోదర రాజనర్సింహా తదితరులతో కలిసి ధరణి సమస్యలపై చర్చించారు.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×