E-Paper
Advertisement

Anand Mahindra: మెగాస్టార్ చిరంజీవిని కలవడం నిజంగా సర్ ప్రైజ్: ఆనంద్ మహీంద్రా

Anand Mahindra: మెగాస్టార్ చిరంజీవిని కలవడం నిజంగా సర్ ప్రైజ్: ఆనంద్ మహీంద్రా
Advertisement

Anand Mahindra: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ 2047 విజన్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన.. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి వివిధ రంగాల నేతలు, పారిశ్రామిక వేత్తలు, అంతర్జాతీయ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానితుడిగా వచ్చిన మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా హైదరాబాద్ పర్యటనలో తనకు ఎదురైన విశేష అనుభవాలను.. సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

మంగళవారం హైదరాబాద్ చేరుకున్న ఆయన, రాష్ట్ర భవిష్యత్ దిశగా రూపొందించిన ‘తెలంగాణ విజన్ 2047’ ప్రణాళికపై సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా చర్చించే అవకాశం దక్కిందని అన్నారు. తెలంగాణ సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పే ఈ సమ్మిట్ కొత్త ఆలోచనలకు, కొత్త పెట్టుబడులకు వేదికగా నిలుస్తుందంటూ ప్రశంసించారు. ఈ పర్యటనలోనే అనూహ్యంగా మెగాస్టార్ చిరంజీవిని కలిసే అవకాశం లభించిందని ఆయన వివరించారు.

Advertisement

ఈ భేటీపై ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. చిరంజీవి గారు ఒక లెజెండ్. ఆయనను కలవడం ఒక సర్ ప్రైజ్. కానీ ఆయనలోని వినయం, సహజ సిద్ధమైన జిజ్ఞాస ఆయన్ను మరింత ఆత్మీయుడిగా మార్చాయి. ఆయనను కలవడం ఒక శక్తివంతమైన విషయాన్ని గుర్తుచేసింది. సినిమా, వ్యాపారం, విధాన రూపకల్పన.. ఇలా ఏ రంగంలోనైనా శాశ్వత విజయం సాధించాలంటే నేర్చుకోవాలనే జిజ్ఞాస, వినయంతో వినగలిగే నైజం పునాదుల వంటివి అని తెలిపారు. ఈ మేరకు ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌లో పాల్గొన్న సందర్భంగా ఆయన రాష్ట్ర అభివృద్ధిపై కూడా ప్రశంసలు కురిపించారు. యువ జనాభా, సాంకేతిక నైపుణ్యం, వ్యాపార వాతావరణం ఈ మూడు అంశాలు తెలంగాణను భవిష్యత్ పెట్టుబడుల కేంద్రంగా మార్చగల శక్తి ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement

ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర ఫొటో కూడా తమ ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. చిరంజీవి, ఆనంద్ ముచ్చటిస్తుండగా.. మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి చిరునవ్వుతో వింటూ ఉండడం ఆ ఫొటోలో చూడొచ్చు.

Related News

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

Big Stories

Advertisement
×