E-Paper
Advertisement

Kodangal : కొడంగల్ లో టెన్షన్.. టెన్షన్.. కాంగ్రెస్ కార్యకర్తలపై దాడి..

Kodangal : కొడంగల్ లో టెన్షన్.. టెన్షన్.. కాంగ్రెస్ కార్యకర్తలపై దాడి..
Advertisement

Kodangal : టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కొడంగల్‌ నియోజకవర్గంలో హైటెన్షన్‌ నెలకొంది. కోస్గి మండలంలో బీఆర్ఎస్- కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. సర్జాఖాన్‌పేట్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

హైదరాబాద్ నుంచి కొడంగల్ వెళ్లి కాంగ్రెస్ కార్యకర్తలను.. సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి అనుచరులు రెచ్చగొట్టారని తెలుస్తోంది. AS రావు నగర్‌ కార్పొరేటర్‌ శిరీష భర్తే సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి. కాంగ్రెస్‌ నుంచి ఉప్పల్ టికెట్‌ను ఆయన ఆశించారు. టికెట్ దక్కకపోవడంతో బీఆర్‌ఎస్‌లో చేరారు . దాదాపు 50 వాహనాల్లో 100 మంది అనుచరులతో కోస్గికి వచ్చిన సోమశేఖర్‌రెడ్డి.. తమపై దురుసుగా ప్రవర్తించారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

Advertisement

ప్రస్తుతం కొడంగల్‌లో కర్ఫ్యూ వాతావరణం కొనసాగుతోంది. బీఆర్‌ఎస్‌ నేతలు తమపై దాడులకు పాల్పడుతున్నారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. వరుస దాడుల ఘటనలతో కొడంగల్ ప్రజలు భయాందోళనలో ఉన్నారు. శాంతియుత వాతావరణం నెలకొనేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

తెలంగాణలో హాట్ టాపిక్ ఉన్న నియోజకవర్గాల్లో కొడంగల్ ఒకటి. ఇక్కడ నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఈసారి రేవంత్ గెలుపు లాంఛనమే అనే అంచనాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో కొండగల్ లో కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు జరగడం ఉద్రిక్తతలు దారితీసింది. ఓటమి భయంతోనే బీఆర్ఎస్ నేతలు ఇలాంటి చర్యలను పాల్పడుతున్నారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.

Advertisement

.

.

.

Tags

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×