Animal Story Leaked : యానిమల్ స్టోరీ లీక్ ..వైలెన్స్ ఎట్ పీక్స్ అంటున్న నెటిజన్స్..

Animal Story Leaked : యానిమల్ స్టోరీ లీక్ ..వైలెన్స్ ఎట్ పీక్స్ అంటున్న నెటిజన్స్..

Animal Story Leaked
Share this post with your friends

Animal Movie Story

Animal Story Leaked : రణ్ బీర్ కపూర్ మోస్ట్ అవైటెడ్ మూవీ “యానిమల్”. ఈ మూవీలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు మేకర్స్ స్వయంగా సినిమా స్టోరీ లీక్ చేశారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. అర్జున్ రెడ్డి తర్వాత..‘కబీర్ సింగ్’ అంటూ దాన్ని హిందీలో రీమేక్ చేశాడు సందీప్.

అర్జున్ రెడ్డి ఒక రొమాంటిక్ మూవీ అని అందరూ అనుకుంటారు .కానీ అందులో ఏ రేంజ్ వైలెన్స్ ఉందో బాగా గమనించిన వారికి క్లియర్ గా అర్ధం అవుతుంది. ఇప్పుడు అదే రేంజ్ లో ‘యానిమల్’ అంటూ మరింతగా ప్రేక్షకులకు వయోలెంట్ ఎక్స్పీరియన్స్ అందివ్వడానికి రెడీ అవుతున్నాడు ఈ డైరక్టర్. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన సాంగ్స్ లో రణ్ బీర్ లుక్ చూస్తేనే అతని ఎంత వైలెంట్ క్యారెక్టర్ గా చూపించబోతున్నారు అర్థమవుతోంది.

ఆల్రెడీ షూటింగ్ పూర్తి కావడంతో ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరగతున్నాయి. మూవీ నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ ను అనుకోవడమే కాకుండా మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన నాన్న నువ్వు నా ప్రాణం అనే సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సాంగ్ లో సందీప్.. తండ్రి కొడుకుల మధ్య ఉన్న అనుబంధాన్ని చాలా డీప్ గా చూపించాడు. అయితే ఈ సాంగ్ ని జాగ్రత్తగా గమనిస్తే మూవీ స్టోరీ ఏంటో అర్థం అయిపోతోంది.

ఈ సాంగ్ లో హీరోకి చిన్నప్పటి నుంచి తండ్రి అంటే ఉన్న ఇష్టం.. బిజినెస్ కారణంగా తండ్రి అతనిని అశ్రద్ధ చేయడం.. కొడుకుతో తండ్రికి స్పెండ్ చేయడానికి టైం లేకపోవడం లాంటి సీన్స్ చూపిస్తారు. ఇక ఫైనల్ గా పెరిగి పెద్దయిన కొడుకు తన గర్ల్ ఫ్రెండ్ తీసుకొచ్చి పరిచయం చేసినా తండ్రి దగ్గర మాట్లాడడానికి టైం లేదు. దీంతో బాగా డిస్టర్బ్ అయి హీరో తండ్రికి దూరంగా వెళ్ళిపోయి తన గర్ల్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటాడు. అయితే ఎవరో తెలియని బిజినెస్ రైవల్స్ తండ్రిపై హత్యాయత్నం చేస్తున్నారు అన్న వార్త తెలుసుకొని అతను తిరిగి తండ్రి దగ్గరకు వస్తాడు.

అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న అతని లైఫ్ లో అసలు తుఫాన్ అప్పుడే మొదలవుతుంది. తండ్రిని కాపాడుకునే క్రమంలో అతనిలో దాగి ఉన్న ‘యానిమల్’ వెర్షన్ బయటకు వస్తుంది. ఇక అప్పుడు మొదలవుతుంది అసలు కోత.. భయంకరమైన ఊచకోత. సాంగ్ లాస్ట్ కి వచ్చేసరికి ఒక సన్నివేశంలో విపరీతంగా దెబ్బలు తగిలిన ఏమాత్రం తగ్గకుండా హీరో ప్లేన్ ని నడుపుతూ ఉంటాడు. ఇలాంటి హై ఇంటెన్సిటీ సీన్స్ థియేటర్లో చూస్తే ఆ కిక్ వేరుగా ఉంటుంది. అప్పట్లో కబీర్ సింగ్ ప్రమోషన్ సందర్భంలో సందీప్ వంగాను ఇంత వైలెంట్ గా మూవీని తీస్తున్నారే అని అడిగినప్పుడు.. ఇదేం వైలెన్స్ నా నెక్స్ట్ మూవీలో చూపిస్తాను అసలు వైలెన్స్ అంటే ఎలా ఉంటుందో అని అన్నారట. అంటే ఆ వైలెన్స్ ఇప్పుడు ‘యానిమల్’ లో చూపించాడు అంటున్నారు నెటిజన్స్.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Kantara Collections: మరో మైల్ స్టోన్ సాధించిన ’కాంతార’

BigTv Desk

Ram Charan : RC 15…చరణ్ లుక్స్.. శంకర్ స్కెచ్ తెలిస్తే షాకే

BigTv Desk

Kalyan Ram : 500 మంది ఫైటర్స్‌తో క‌ళ్యాణ్ రామ్ ఫైట్

Bigtv Digital

Mahesh movie update : మ‌రింత వెన‌క్కి SSMB 28… నిర్మాతల మల్లగుల్లాలు

BigTv Desk

AR Rahman: చెన్నైలో వరదలు.. ఏఆర్ రెహమాన్ పై విమర్శలు.. ఇంతకీ ఏం చేశారాయన?

Bigtv Digital

Mahesh – Chiranjeevi : మ‌హేష్ సినిమా రిలీజ్ లేన‌ట్లే..సూప‌ర్‌స్టార్ ప్లేస్‌లో మెగాస్టార్ సంద‌డి

Bigtv Digital

Leave a Comment