BigTV English

Bandi Sanjay as Union Minister: కరీంనగర్ సిగలో మరో ఉన్నత పదవి.. కేంద్రమంత్రిగా బండి సంజయ్!

Bandi Sanjay as Union Minister: కరీంనగర్ సిగలో మరో ఉన్నత పదవి.. కేంద్రమంత్రిగా బండి సంజయ్!

Bandi Sanjay as Union Minister: కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కేంద్రమంత్రి అయ్యారు. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డితోపాటు బండి సంజయ్‌కి మోదీ కేబినేట్‌లో చోటు దక్కింది. ఈ మేరకు బండి సంజయ్.. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈయన 2019లో మొదటిసారి ఎంపీ గెలుపొందారు. అప్పటి నుంచి నిత్యం ప్రజలతో మమేకమవుతూ.. వస్తున్నారు. అదే అభిమానంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ భారీ మెజార్టీతో గెలుపొందారు.


మొదటిసారి కేబినేట్ హోదా..

రెండు సార్లు ఎంపీగా గెలిచిన బండి సంజయ్.. మొదటిసారి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎంపీగా ఉన్న సమయంలో వేల కోట్ల నిధులు తెచ్చిన సంజయ్.. కేంద్ర మంత్రి కావడంతో రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంలో బీజేపీ తరఫున కరీంనగర్ నుంచి విద్యాసాగర్ రావు కేంద్రమంత్రిగా కొనసాగగా.. ప్రస్తుతం మరోసారి కరీంనగర్ నుంచి బండి సంజయ్.. కేంద్ర మంత్రి హోదాను దక్కించుకున్నారు.


గల్లీ టూ ఢిల్లీ ప్రయాణం..

కరీంనగర్ నుంచి 2005లో తొలిసారి బీజేపీ కార్పొరేటర్‌గా బండి సంజయ్ ఎన్నికయ్యాడు. ఆ తర్వాత 2010లో రెండోసారి విజయం సాధించారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన బండి సంజయ్.. 89వేల భారీ మెజార్టీతో గెలుపొందారు. 2020 నుంచి 2023 వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత 2023 జులై 8న జాతీయ కార్యవర్గ సభ్యుడి ఎన్నికైన బండి సంజయ్.. 2023 జులై 29న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియామకమయ్యారు. తాజాా, 2024 మే 13న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా 2లక్షల ఓట్ల మెజార్టీతో రెండోసారి ఎంపీగా గెలుపొందారు.

Also Read: రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్.. ఆరోగ్య శ్రీలో అదనంగా 65 కొత్త చికిత్సలు

రాజకీయ జీవితమంతా ఆటుపోట్లే..

బండి సంజయ్ రాజకీయ జీవితమంతా ఆటుపోట్లతోనే గడిచింది. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన బండి.. బీజేపీ కార్యకర్తగా ప్రస్తానం ప్రారంభించారు. ఆ తర్వాత కార్పొరేటర్‌గా రెండు సార్లు గెలిచిన ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ప్రజా సమస్యలపై పోరాడి రెండు సార్లు జైలుకు సైతం వెళ్లారు. ప్రజలు, కార్యకర్తల కోసం పోరాడిన సంజయ్‌పై దేశంలోనే అత్యధిక కేసులు నమోదయ్యయి. ఎన్నో అవమానాలు ఎదురైనా నమ్మిన సిద్ధాంతాన్ని వదలని బండి సంజయ్‌కి ప్రస్తుతం మోదీ కేబినేట్‌లో చోటు దక్కడంతో అభిమానులు హర్షం వ్యకత్ం చేస్తున్నారు.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×