E-Paper
Advertisement

Bandi Sanjay : ‘క్షుద్ర పూజలు చేయడం కాదు.. కట్టిన ప్రాజెక్టులు కూడా చూడాలి’

Bandi Sanjay : తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ మాజీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆదివారం ఘాటు విమర్శలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టలో అవినీతి ఉందని, బీసీలకు గులాబీ పార్టీ మోసం చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Bandi Sanjay : ‘క్షుద్ర పూజలు చేయడం కాదు.. కట్టిన ప్రాజెక్టులు కూడా చూడాలి’
Advertisement

Bandi Sanjay : తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ మాజీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆదివారం ఘాటు విమర్శలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, బీసీలకు గులాబీ పార్టీ మోసం చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీసీలకు అన్యాయం చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. బీఆర్‌ఎస్ బీసీలకు 23 సీట్లే ఇచ్చిందని, కాంగ్రెస్ 19 సీట్లే ఇచ్చిందని అన్నారు. ఆ రెండు పార్టీలు బీసీలకు వ్యతిరేకమని ఎత్తిచూపారు.బీసీలను రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. అందుకే మంత్రి గంగుల కమలాకర్‌కి బీఆర్ఎస్ పార్టీ బీ-ఫామ్ ఇవ్వలేదని వ్యాఖ్యానించారు.

Advertisement

కాంగ్రెస్ పార్టీలో నేతలందరూ సీఎం పదవి కోసం గొడవపడుతున్నారని అన్నారు. అందుకే గాంధీ భవన్‌ను సీఎం పొగ కమ్మేసిందని చెప్పారు. సీఎం పదవి రేసులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చివరికి బకరా అవుతారని జోస్యం చెప్పారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ.. “క్షుద్ర పూజలు చేయడమే కాదు.. అప్పుడప్పుడూ కట్టిన ప్రాజెక్టులు కూడా పరిశీలించాలి” అని సీఎం కేసీఆర్‌ని ఉద్దేశించి ఘాటుగా విమర్శించారు. “మోటార్లు మునిగింది వాస్తవం.. ప్రాజెక్టు కుంగింది వాస్తవం.. పిల్లర్లకు పగుళ్లు వాస్తవం” అని బీఆర్ఎస్‌పై తీవ్రంగా మండిపడ్డారు. కేసీఆర్ తిన్నదంతా కక్కిస్తామని, కాళేశ్వరం కేసీఆర్ తాత ఆస్తి కాదని అన్నారు. ‘‘కేటీఆర్.. నీ అయ్యను పట్టుకుని రా..కాళేశ్వరం దగ్గరకు నిపుణులను పట్టుకుని రా.. నా సవాల్‌కు సిద్ధమా..’’ అంటూ విరుచుకుపడ్డారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×