E-Paper
Advertisement

Warangal East : బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2.. కొండా జెండా ఎగరేస్తుందా ?

Warangal East : బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2.. కొండా జెండా ఎగరేస్తుందా ?
Advertisement

Warangal East : తెలంగాణ ఎన్నికలపై బిగ్ టీవీ చేపట్టిన సర్వేలో ఫలితాలపై ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. వరంగల్ జిల్లా వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంపై తాజాగా చేపట్టిన సర్వేలో ఓటర్ల తీర్పు ఎటువైపు ఉందో స్పష్టంగా తెలుస్తోంది. ఈ సెగ్మెంట్ లో 2,46,367 ఓట్లు ఉన్నాయి. అందులో పురుషులు 1,20,323 మంది ఉండగా.. మహిళా ఓటర్లు 1,25,621 మంది ఉన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్.

బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-1 (13-09-2023)

Advertisement

బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపనేని నరేందర్ కు 42 శాతం ఓట్లు సాధిస్తారని బిగ్ టీవీ చేసిన పందెం కోళ్లు-1 సర్వేలో తేలింది. కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ బరిలోకి దిగితే 41 శాతం ఓట్లు సాధిస్తారని వెల్లడైంది. ఇక్కడ బీజేపీకి 11 శాతం, ఇతరులకు 6 శాతం ఓట్లు పడుతాయని తెలిసింది.

బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2 (04-11-2023)..

Advertisement

తాజాగా బిగ్ టీవీ చేసిన బిగ్ టీవీ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్నపనేని నరేందర్ కి 40 శాతం ఓట్లు వస్తాయని సర్వేలో వెల్లడైంది. కాంగ్రెస్ అభ్యర్థి కొండాసురేఖకు 44 శాతం, బీజేపీకి 12 శాతం ఓట్లు వస్తాయని తేలింది.

లెక్కల్లో స్వల్ప మార్పు..

రెండు సర్వేల ఆధారంగా ఓట్ల లెక్కలు పరిశీలిస్తే బీఆర్ఎస్ కు 2 శాతం ఓట్లు తగ్గుతుండగా.. కాంగ్రెస్ బలం కొంతమేర పెరిగిందని స్పష్టంగా తేలింది. బీఆర్ఎస్ కు 2 శాతం ఓట్లు తగ్గుతుండగా.. కాంగ్రెస్ కు 3 శాతం, బీజేపీకి 1 శాతం ఓట్లు పెరుగుతున్నాయి. ఈ నియోజకవర్గంలో ఓటర్లు కాంగ్రెస్ నే గెలిపిస్తారని తెలుస్తోంది.

వరంగల్ ఈస్ట్ లో కాంగ్రెస్ అభ్యర్థికి 6 గ్యారెంటీలు ప్లస్ అవుతున్నాయి. అలాగే కొండా సురేఖ దంపతుల వ్యక్తిగత ఇమేజ్ కూడా కలిసి వస్తోంది. కొండా సురేఖ మురళి ఇద్దరూ క్షేత్రస్థాయిలో విస్తృతంగా పని చేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపనేని నరేందర్ కు ప్రజా వ్యతిరేకత ఎదురవుతోంది. బీజేపీ అభ్యర్థిగా ఎర్రబెల్లి ప్రదీప్ రావుకు వ్యక్తిగత ఇమేజ్ కొంత వరకు కలిసి వస్తున్నా.. ఇటీవల తెలంగాణలో కమలం పార్టీ ప్రభావం తగ్గడంతో ఆయన ఎఫెక్ట్ అంతగా లేదు. ఇప్పటికిప్పుడైతే వరంగల్ ఈస్ట్ లో కొండా సురేఖదే విజయమని బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×