Bandi Sanjay : ఒకవైపు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా మరోవైపు నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత ఏర్పడ్డాయి. డ్యామ్‌పైకి వెళ్లకుండా తెలంగాణ పోలీసులు గేటు వేసి అడ్డుకున్నారని ఏపీ పోలీసులు, ఇరిగేషన్ అధికారులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ వైపు ఉన్న గేటుకు సంబంధించిన సెన్సార్‌ను తెలంగాణ పోలీసులు పగలగొట్టారని ఆరోపించారు. ఏపీ ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదుతో సెక్యూరిటీ కల్పించామని ఏపీ పోలీసులు చెబుతున్నారు. సాగర్ డ్యామ్‌పై ఏపీ సరిహద్దుల్లో తమ పరిధిలో ఇరిగేషన్ అధికారులు ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.
ఈ వివాదంపై తెలంగాణ బీజేపీ లీడర్ బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ ను రగిల్చే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్ చేసి ఇంకా తెలంగాణ సెంటిమెంట్ అంటే ఎలా అని ప్రశ్నించారు. నాగార్జునసాగర్ ఇష్యూ ఇప్పుడే ఎందుకు తెరపైకి వచ్చిందని నిలదీశారు. ఎన్నికల వేళ కేసీఆర్ తప్పుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ఓటమి ఖాయమని తేలిపోవడంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
ఏపీలో అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నప్పుడు కేసీఆర్ ఎందుకు స్పందించలేదని బండి నిలదీశారు. అప్పుడు సీఎం ఫాంహౌస్ లో పడుకున్నారని సెటైర్లు వేశారు. డిసెంబర్ 3న కేసీఆర్ మాజీ సీఎం కాబోతున్నారని బండి సంజయ్ జోస్యం చెప్పారు.