E-Paper
Advertisement

Celebrity Votes: జూబ్లీహిల్స్ లో ఓటేసిన సెలబ్రిటీలు.. క్యూ లైన్లో స్టార్ హీరోలు

Celebrity Votes: జూబ్లీహిల్స్ లో ఓటేసిన సెలబ్రిటీలు.. క్యూ లైన్లో స్టార్ హీరోలు
Advertisement

Celebrity Votes: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తొలిఓటు తమదేకావాలని పోలింగ్ బూత్ ల వద్దకు చేరుకున్నారు. హైదరాబాద్ లో మొత్తం 15 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతుండగా.. 35 వేల మంది పై చిలుకు పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పహారా కాస్తున్నారు.

కాగా.. జూబ్లీహిల్స్ లో ఒకే ఒక్క పోలింగ్ బూత్ ఉండగా.. ఇక్కడ 1531 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. టాలీవుడ్ హీరోలు, దర్శక నిర్మాతలు, నటీనటులు ఈ పోలింగ్ బూత్ లో ఓటేయనున్నారు. సంగీత దర్శకుడు కీరవాణి కుటుంబంతో సహా ఓటు హక్కును వినియోగించుకోగా.. స్టార్ హీరోలు అల్లు అర్జున్, సుమంత్ లు క్యూ లైన్లో నిలబడి ఓటేశారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా కుటుంబంతో సహా పోలింగ్ బూత్ కు చేరుకుని ఓటేశారు. ఇదే పోలింగ్ స్టేషన్ లో మెగాస్టార్ చిరంజీవి దంపతులు ఓటు వేశారు.

Advertisement

దర్శకుడు తేజ, నటుడు విక్టరీ వెంకటేష్, హీరో నితిన్, డైరెక్టర్లు రాఘవేంద్రరావు, రాజమౌళి, రమ, నటుడు శివాజీ రాజా, నేచురల్ స్టార్ నాని, యాంకర్ సుమ, హీరో సుధీర్ బాబు దంపతులు, రవితేజ, ప్రియదర్శి, గోపీచంద్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాదాపు పెద్ద సెలబ్రిటీల ఓట్లు ఈ బూత్ లోనే ఉండటంతో.. పోలీసులు బందోబస్త్ ను మరింత పటిష్టం చేశారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×