IND Vs PAK : ఆసియా కప్ 2025 లో భాగంగా ఇవాళ చివరి ఘట్టం ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య తొలిసారిగా ఆసియా కప్ ఫైనల్ జరుగబోతుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించేందుకు రెండు జట్లు కూడా తామే విజయం సాధిస్తామని ధీమాగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ అభిషేక్ బచ్చన్ ని ముందుగానే ఔట్ చేస్తే.. భారత్ తీవ్ర ఇబ్బందుల్లో పడుతుంది కామెంట్ చేశాడు. కానీ వాస్తవానికి అభిషేక్ బచ్చన్ క్రికెటర్ కాదు..అతను బాలీవుడ్ హీరో ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read : IND VS PAK, Final: ట్రోఫీ ఇవ్వనున్న నఖ్వీ.. వాడిస్తే మేం తీసుకోబోమంటున్న టీమిండియా..!
ముఖ్యంగా టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ పేరు వింటేనే పాకిస్తాన్ కలవరపడుతోంది. ఈ టోర్నీలో టీమిండియా కీలక ఆటగాడు అద్బుతంగా బ్యాటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. షాహీన్ అఫ్రిది వంటి బౌలింగ్ లో తొలి బంతినే సిక్స్ గా మలిచాడు. ముఖ్యంగా అభిషేక్ బచ్చన్ పేరును చెప్పిన మాజీ పేసర్ షోయబ్ అక్తర్ సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ కి గురయ్యాడు. “పాకిస్తాన్ అభిషేక్ బచ్చన్ ని త్వరగా ఔట్ చేయాలి. ఇప్పటివరకు టీమిండియా మిడిల్ ఆర్డర్ తో అంతగా రాణించలేదు. అభిషేక్ ను కూడా ఔట్ చేయకపోతే పాకిస్తాన్ కి ఇబ్బందులు తప్పవు. అప్పుడే భారత్ మిగతా బ్యాటర్లు కాస్త ఆచితూచి ఆడేందుకు ప్రయత్నిస్తూ పరుగుల కోసం కష్టపడుతారు. భారత్ తమ అత్యుత్తమ గేమ్ ని తీసుకొస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఉన్నారు. పాకిస్తాన్ పై టాప్ క్లాస్ ఆటను ఆడాలని భారత్ కి చెబుతున్నాడు. మరోవైపు కన్నేసిన భారత్ ను అడ్డుకోవడం తమ జట్టుకు చాలా కష్టం” అని షోయబ్ అక్తర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
ఇక ఒకే ఒక్క పని చేస్తేనే టీమిండియా పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు వీలు అవుతుందని సూచించాడు. పాక్ ఆటగాళ్లు తమ మైండ్ సెట్ ను త్వరగా మార్చుకోవాలని సలహా ఇచ్చాడు. మరోవైపు టీమిండియా క్రికెటర్ అభిషేక్ శర్మ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. అభిషేక్ శర్మ మనిషి కాడు.. వాడు ఓ జంతువు అని సంచలన కామెంట్స్ చేశాడు. మరోవైపు తన క్రికెట్ రోజుల్లో అక్తర్ చాలా కోపంతో కనిపించేవాడు. 2025 ఆసియా కప్ లో ఇండియా- పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ కి ముందు ఇదే స్వభావంతో రెచ్చిపోయాడు. సెప్టెంబర్ 28న జరిగే హై వోల్టేజ్ మ్యాచ్ కి ముందు షోయబ్ అక్తర్ పాకిస్తాన్ జట్టుకు కిల్లర్ వైఖరీని అవలంభించాలని సందేశం ఇచ్చాడు. భారత జట్టు గర్వాన్ని అణిచివేసే ఉద్దేశంతోనే మైదానంలోకి రండి అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే అభిషేక్ శర్మ క్రీజులో ఉంటే పాకిస్తాన్ తట్టుకోవడం చాలా కష్టమే అని వెల్లడించాడు.