Bharat Jodo Yatra : తెలంగాణలో భారత్ జోడో యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. 8వ రోజు బోయిన్ పల్లి గాంధీయన్ ఐడియాలజీ సెంటర్ నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభమైంది. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రాహుల్‌గాంధీకి కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. దారిపొడవునా స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మియాపూర్ బొల్లారం చౌరస్తాలో మహిళలు బోనాలు, డప్పు కళాకారుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బాలీవుడ్ నటి పూజా భట్ భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. రాహుల్ తో కలిసి కొంతదూరం ఉత్సాహంగా నడిచారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీతక్క పాదయాత్రలో పాల్గొన్నారు.
బుధవారం రాహుల్ గాంధీ 27.8 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు. న్యూ బోయిన్ పల్లి, బాలనగర్ మెయిన్ రోడ్, ఫిరోజ్ గుడా, జింకల వాడ, మూసాపేట్, కూకట్ పల్లి, హఫీజ్ పేట, మదినగూడ, బీహెచ్ఈఎల్ మీదుగా పటాన్ చెరుకు చేరుకుంటారు.
రాత్రి ముత్తంగిలో రాహుల్ గాంధీ బస చేస్తారు.