Indian Railways: దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, ఆకస్మిక వరదల నేపథ్యంలో భారతీయ రైల్వే ముందస్తు జాగ్రత్తలు చేపడుతోంది. అందులో భాగంగానే పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్న రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసింది. ముఖ్యంగా జమ్మూకాశ్మీర్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన రైళ్లు ఎక్కువగా ప్రభావితం అయ్యాయి.
45 రైళ్లను రద్దు చేసిన ఉత్తర రైల్వే
జమ్మూ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉత్తర రైల్వే 45 రైళ్లను రద్దు చేసింది. 25 రైళ్లను స్వల్పకాలిక రద్దు చేసింది. ప్రయాణీకుల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ హిమాన్షు శేఖర్ ఉపాధ్యాయ్ తెలిపారు. రద్దు అయిన రైళ్ల వివరాలను వెల్లడించేందుకు జమ్మూ తావి, శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా, పఠాన్ కోట్, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రయాణీకుల సౌలభ్యం కోసం హెల్ప్ లైన్ నంబర్ లను ప్రకటించారు. జమ్మూకు 7888839911, ఢిల్లీకి 97176387751 హెల్ప్ లైన్లను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు.
రాజస్థాన్ లో 10 రైళ్లు రద్దు
అటు జమ్మూకాశ్మీర్ లో భారీ వర్షాల కారణంగా రాజస్థాన్ నుంచి రాకపోకలు కొనసాగించే 10 రైళ్లు క్యాన్సిల్ అయ్యాయి. భారీ వర్షం కారణంగా ట్రాక్ దెబ్బతినడంతో ఐదు రోజులుగా రైలు సేవలు పూర్తిగా నిలిపివేయబడ్డాయి. కథువా-మాధోపూర్ (పంజాబ్) సమీపంలోని ట్రాక్ తీవ్రంగా దెబ్బతిన్నది. మరమ్మతు పనులు జరుగుతున్నాయి. పరిస్థితి సాధారణ స్థితికి రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. వరుసగా ఐదవ రోజు, రాజస్థాన్ నుంచి జమ్మూకు వెళ్లే, తిరిగి వచ్చే ప్రధాన రైళ్లు రద్దు చేయబడ్డాయి. బుధవారం నుంచి ప్రతిరోజూ ఎనిమిది నుంచి పది రైళ్లు ప్రభావితమయ్యాయి. వాటిలో జమ్మూ తావి, కత్రాకు వెళ్లే రైళ్లు కూడా ఉన్నాయి.
సైనిక సిబ్బంది, యాత్రికులపై తీవ్ర ప్రభావం
గత ఐదు రోజులుగా రైళ్లు రద్దు కావడంతో ఈ ప్రభావం ఎక్కువగా సైనిక సిబ్బంది, యాత్రికుల మీద పడింది. జమ్మూ కాశ్మీర్ ప్రధాన సైనిక ప్రాంతం కావడంతో ప్రతిరోజూ వందలాది మంది సైనికులు రాజస్థాన్ నుంచి రాకపోకలు కొనసాగిస్తాయి. అటు పెద్ద సంఖ్యలో యాత్రికులు వైష్ణో దేవిని సందర్శించడానికి ప్రయాణిస్తారు. మొత్తంగా రైళ్ల రద్దు కారణంగా సైనికులు, యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Read Also: తెలంగాణలో మరో వందేభారత్ కు హాల్టింగ్, రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్!
ఇవాళ రద్దు అయిన రైళ్ల వివరాలు
1- బార్మర్–జమ్మూ తావి
2- జమ్మూ తావి–బార్మర్
3- భగత్ కీ కోఠి–జమ్మూ తావి
4- జమ్మూ తావి–భగత్ కీ కోఠి
5- అజ్మీర్–జమ్మూ తావి
6- జమ్మూ తావి–అజ్మీర్
7- జమ్మూ తావి–సబర్మతి
8- సబర్మతి–జమ్మూ తావి
9- MCTM ఉధంపూర్–భావ్ నగర్ టెర్మినస్
10- జమ్మూ తావి–బాంద్రా టెర్మినస్.
Read Also: రైలు పట్టాల మీదే కరెంటు తయారీ, ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం!