Solar Storm: భూమికి మరో ముప్పు పొంచి ఉంది. నేడు భూమిని తాకనుంది సోలార్ స్ట్రోమ్. ఈ సోలార్ స్ట్రోమ్ కారణంగా పవర్‌గ్రిడ్స్, శాటిలైట్స్ పనితీరుపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. సూర్యూడిపై కరోనాల్ మాస్ ఏజెక్షన్ జరిగినట్టు సైంటిస్టులు గుర్తించారు. ఆగస్టు 30న ఇది జరిగిందని.. ఇప్పుడీ స్ట్రోమ్ స్పేస్‌లో ప్రయాణిస్తూ వస్తుందన్నారు.
రెండు రోజుల పాటు ప్రభావం ఉండే అవకాశం
ఈ స్ట్రోమ్ ఈ రోజు అర్ధరాత్రి సమయంలో భూమిని తాకే అవకాశం ఉంది. అయితే ఈ ప్రభావం రెండు రోజుల పాటు ఉండే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. కాస్త సమయం తేడాలోనే సూర్యూడిపై పలు CMRలు జరిగినట్టు గుర్తించారు. అందుకే ఈ ప్రభావం ఒకరోజు కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉందంటున్నారు.
భూమి అయస్కాంత శక్తిపై ప్రభావం పడే అవకాశం
ఈ సోలార్ స్ట్రోమ్స్ భూమి అయస్కాంత శక్తిపై ప్రభావం చూపుతాయి. సూర్యుడి కరోనా నుంచి వెలువడే కణాలు భూమిపై ఉండే అయస్కాంతావరణంలోని పరమాణువులు, అణువులపై ప్రభావం చూపుతాయి. దీంతో ఆ శక్తితో పనిచేసే వ్యవస్థలు చెల్లాచెదరయ్యే అవకాశం ఉంటుంది. టెలి కమ్యూనికేషన్ వ్యవస్థలు, విద్యుత్ వ్యవస్థ కూడా ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంది. GPS, రేడియో, శాటిలైట్ కమ్యూనికేషన్స్ దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది.
ఆకాశంలో అరోరాలు కనిపించే అవకాశం
సోలార్ స్ట్రోమ్ అనగానే అందరికి 1859లోజరిగిన ఉపద్రవమే గుర్తొస్తుంది. ఆ ఏడాది వచ్చిన సోలార్ స్ట్రోమ్ కారణంగా అన్ని టెలీగ్రాఫ్ స్టేషన్లు దెబ్బతిన్నాయి. ఆకాశంలో అరోరాలు ఏర్పడ్డాయి. దీన్ని బట్టి చెప్పవచ్చు.. భూమి అయస్కాంత వ్యవస్థను సోలార్ స్ట్రోమ్ ఏ రేంజ్‌లో ప్రభావితం చేస్తుందనేది.
హైఅలర్ట్‌లో పవర్ గ్రిడ్‌లు, శాటిలైట్ మానిటరింగ్ సెంటర్లు
G2, G3 క్లాస్ జియో మాగ్నటిక్ స్ట్రోమ్ ఏర్పడే అవకాశం ఉందన్న NASA..
భూకంపాలను రిక్టర్ స్కేల్‌పై ఎలాగైతే కొలుస్తారో.. సోలార్ స్ట్రోమ్స్‌ను కూడా జీ1, జీ2, జీ3, జీ4, జీ5లల్లో కొలుస్తారు. జీ1 అంటే దాని ప్రభావం నామమాత్రమే.. జీ5 అంటే భూమిపై ఉన్న సాంకేతిక వ్యవస్థలకు పెద్ద ఉపద్రవం పొంచి ఉన్నట్టే. అయితే ప్రస్తుతం ఏర్పడే సోలార్ స్ట్రోమ్ జీ2, జీ3లో ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు. ఇప్పటికే హైఅలర్ట్‌లో పవర్ గ్రిడ్‌లు, శాటిలైట్ మానిటరింగ్ సెంటర్లు ఏర్పాటు చేసిన నిపుణులు.. అంటే ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం లేదంటున్నారు. రాబోయే నెలల్లో మరిన్ని స్ట్రోమ్స్ వస్తాయంటున్న నిపుణులు..
Also Read: నిన్న జిన్‌పింగ్, ఇవాళ పుతిన్‌తో.. మోదీ బిగ్ మీటింగ్స్..
సోలార్ స్ట్రోమ్ కారణంగా ఏర్పడే అరోరాలు అమెరికాలోని పలు రాష్ట్రాల్లో కనిపించనున్నాయి. ఇక ఆసియా దేశాల్లో ఆకాశం క్లియర్‌గా ఉంటే కనిపించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక స్పేస్ సైంటిస్టులకు వీటిని స్టడీ చేయడానికి అద్భుత అవకాశం అంటున్నారు నిపుణులు.