BigTV English

Part Time Job Oppurtunites : పార్ట్ టైం జాబ్స్.. చేతి నిండా అవకాశాలు..

Part Time Job Oppurtunites : పార్ట్ టైం జాబ్స్.. చేతి నిండా అవకాశాలు..

Part Time Job Oppurtunites : చదువుకుంటూ కూడా సంపాదించుకునే అవకాశాలు ఇప్పుడు భారీగా పెరిగాయి. ఇంటర్నెట్ డిజిటల్ వాడకం ఎక్కువైన తరువాత ఇంట్లో నుండే అనేక అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. సరైన స్కిల్స్, ఇంటర్నెట్, కంప్యూటర్.. ఈ మూడు ఉంటే.. ఇంట్లో ఉండే మీరు మీ ఖాళీ సమయంలో సంపాదించుకోవచ్చు. ఈ పార్ట్ టైమ్ జాబ్స్ చేయడానికి దానికి తగిన స్కిల్స్ ఉంటే సరిపోతుంది.. మీరు గ్రాడ్యూయేట్స్, సర్టిఫికేట్స్ పొందాల్సిన చూపించాల్సిన అవసరం లేదు.


ఇంగ్లీష్‌తో పాటు లోకల్ భాషపై కొంత పట్టు ఉన్నవారు పార్ట్‌టైం ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసుకోవచ్చు. అనేక పబ్లిషింగ్ సంస్థలు..తమకు ట్రాన్స్‌లేటర్లు కావాలని రెగులర్‌గా ప్రకటనలు ఇస్తూ ఉంటారు. డేటా ఎంట్రీ జాబ్స్ కూడా కోకొల్లలుగా ఉన్నాయి. దీని కోసం మీకు టైపింగ్ స్కిల్స్ ఉండాలి. టైపింగ్ నాలెడ్జ్ లేకపోతే.. నెలలోనే సులువుగా ఇంట్లోనే కంప్యూటర్లో టైపింగ్ నేర్చుకోవచ్చు. ఫ్రీ టైపింగ్ కోర్స్ సాఫ్ట్‌వేర్లు ఇంటర్నెట్లో చాలా ఉన్నాయి.

బ్లాగింగ్‌తో మీరే సొంతంగా వెబ్సైట్ తయారు చేసుకొని అందులో ఆర్టికల్స్ రాస్తూ సంపాదించవచ్చు. మీరు ఆర్టికల్స్‌ను ఆసక్తికరంగా.. ఇంట్రెస్టింగ్‌గా ఇస్తే.. వాటికి వ్యూస్ పెరుగుతాయి.. యాడ్స్‌కు మీ వెబ్‌సైట్‌ను కనెక్ట్ చేయడం ద్వారా వాటిపై వచ్చే క్లిక్స్‌ను బట్టి మీకు ఆదాయం వస్తుంది. మీ వెబ్సైట్‌ను ఎంత ఎక్కువ మంది చూస్తే మీకు అంత లాభం చేకూరుతుంది.


సొంతంగా యూట్యూబ్ చానల్ స్టార్ట్ చేసి కూడా పార్ట్‌టైంగా సంపాదించవచ్చు. కొందరు యూట్యూబర్లు తమ చూట్టూ జరుగుతున్న విషయాలనే యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తుంటారు. వాటికి వచ్చిన వ్యూస్‌నుబట్టి యూట్యూబ్ మీకు పే చేస్తుంది. ఇలా సాధారణ వీడియోలతో సులభంగా సంపాదించవచ్చు.

బైక్, కార్ డ్రైవింగ్ వస్తే పార్ట్ టైంగా సంపాదించవచ్చు. ఓలా, ఉబర్, రాపిడో లాంటి డ్రైవర్ యాప్స్‌ను మీ బైక్‌కు అటాచ్ చేసుకోవాలి. మీకు తీరిక ఉన్నప్పుడు లాగిన్ అయి..కస్టమర్లను డెస్టినేషన్లో డ్రాప్ చేస్తే.. మీకు అప్పటికప్పుడు పేమెంట్స్ జరిగిపోతయాయి. కారు డ్రైవింగ్ వస్తే..మీ దగ్గర కారు లేకున్నా.. indriver లాంటి యాప్స్‌ ద్వారా మీకు వీలయినప్పుడు డ్రైవర్‌గా పనిచేయవచ్చు. కారు ఉండి.. డ్రైవర్ లేని వారు.. తమకు కావలసినప్పుడు డ్రైవర్ కోసం ఈ యాప్స్‌లో వెతుకుతుంటారు..దీంట్లో మీరు లాగిన్ అయితే పార్ట్ టైం క్యాబ్ డ్రైవర్‌గా సంపాదించుకోవచ్చు.

Tags

Related News

Jobs: టెన్త్, ఇంటర్ అర్హతలతో సీసీఆర్ఏఎస్‌లో ఉద్యోగాలు.. మంచి వేతనం.. రేపే లాస్ట్ డేట్ మిత్రమా

Railway Jobs: ఇండియన్ రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. అప్లికేషన్ ఫీజు జస్ట్ రూ.40.. ఇదే మంచి అవకాశం

IOCL Recruitment: ఐవోసీఎల్‌లో భారీగా ఉద్యోగాలు.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు.. డోంట్ మిస్..!

Jobs in AP: ఆంధ్రప్రదేశ్‌లో 185 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. లక్షకు పైగా జీతం, ఇదే మంచి ఛాన్స్..!

JNTU Hyderabad: భారీ వర్షాలు.. ఈ పరీక్షలన్నీ వాయిదా

PGCIL Notification: పీజీసీఐఎల్‌లో 1543 ఉద్యోగాలు.. లక్షకు పైగా జీతం, ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు..!

Big Stories

×