Anushka Shetty Ghaati: అనుష్క శెట్టి (Anushka Shetty).. చివరిగా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఇప్పుడు క్రిష్ జాగర్లమూడి(Krish jagarlamudi) దర్శకత్వంలో ‘ఘాటీ’ అనే రియల్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జూలై 4వ తేదీన విడుదల కావాల్సిన ఈ సినిమా సెప్టెంబర్ 5కి వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇకపోతే విడుదలకు కేవలం నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో అటు ప్రమోషన్స్ కార్యక్రమాలను డైరెక్టర్, చిత్ర బృందం వేగంగా చేపట్టారు. ముఖ్యంగా డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తన సినిమాను ప్రజలలోకి తీసుకెళ్లడానికి ‘ బిగ్ బాస్ అగ్నిపరీక్ష’ వంటి షోలలో కూడా సందడి చేస్తూ.. హైప్ పెంచుతున్న విషయం తెలిసిందే.
ప్రమోషన్స్ కి అనుష్క దూరం..
దీనికి తోడు ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్, పోస్టర్లు అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా అంతా బాగానే ఉన్నా.. ఈ సినిమా ప్రమోషన్స్ కి అనుష్క రాకపోవడం అభిమానులను మరింత నిరాశకు గురిచేసింది. ఇప్పటివరకూ ఈమెను తెరపై చూడడమే తప్ప రియల్ గా చూడడానికి అవకాశం లభించలేదు. దీంతో ప్రమోషన్స్ కి రావాలి అని.. ఎప్పుడెప్పుడు ఈమెను నేరుగా చూడాలి అని అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూశారు. కానీ అనుష్క ప్రమోషన్స్ కి రావడం లేదు అని చిత్ర బృందం చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. దీంతో ప్రతి ఒక్కరూ నిరాశ వ్యక్తం చేశారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అనుష్క ప్రమోషన్స్ లో పాల్గొనబోతోందని తెలుస్తోంది.
మెలిక పెట్టి శుభవార్త తెలిపిన చిత్ర బృందం..
అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఒకటి హైలెట్గా నిలిచింది. అనుష్క ప్రమోషన్స్ కి వస్తుంది కానీ ప్రజల ముందుకు కాదు.. ఇదెక్కడి ట్విస్ట్ అని ఆలోచిస్తున్నారా? నిజమే. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. అనుష్క తెర వెనుక నుండి తన వాయిస్ తో ఘాటీ సినిమా ప్రమోషన్స్ చేపట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati)తో వాయిస్ కాల్ మాట్లాడి సినిమా ప్రమోషన్స్ లో భాగమైన ఈమె.. ఇప్పుడు ఎఫ్ఎం రేడియోలో కూడా సందడి చేయబోతోంది. ఈ మేరకు ఈ విషయాన్ని చిత్ర బృందం తాజాగా అభిమానులతో పంచుకున్నారు.
రెడ్ ఎఫ్ఎం లో సందడి చేయనున్న అనుష్క..
అసలు విషయంలోకి వెళ్తే.. అనుష్క, విక్రమ్ ప్రభు(Vikram Prabhu) ఇద్దరు రెడ్ మిర్చి 98.3 ఎఫ్ఎం రేడియో ద్వారా ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఘాటీ ప్రమోషన్స్ చేయనున్నారు. ముఖ్యంగా తమ వాయిస్ తో సినిమాపై అంచనాలు పెంచబోతున్నారు. ఈ మేరకు ఇందుకు సంబంధించిన పోస్టర్ కూడా ఇప్పుడు వైరల్ గా మారింది.. మొత్తానికైతే తెర ముందుకు రాకపోయినా తెర వెనుకే కథను నడిపించడానికి సిద్ధం అయ్యింది జేజమ్మ. రియల్ కథతో రాబోతున్న అనుష్క ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకోవడం గ్యారెంటీ అని అప్పుడే అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డు సృష్టిస్తుందో సెప్టెంబర్ 5 థియేటర్లలోకి వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.
also read :Bigg Boss AgniPariksha: చివరిదశకు చేరుకుంటున్న అగ్నిపరీక్ష.. మరీ ఇంతలా ఉన్నారేంటి?
Catch ‘The Queen’ #Ghaati
Tune into Radio Mirchi 98.3 FM today at 5 PM 📷#Ghaati GRAND RELEASE WORLDWIDE ON 5th SEPTEMBER 2025. #Ghaati #KrishJagarlamudi #Vikramprabhu #AnushkaShetty @MsAnushkaShetty @iamVikramPrabhu @FirstFrame_Ent @UV_Creations pic.twitter.com/uGUGQdiywh
— BIG TV Cinema (@BigtvCinema) September 1, 2025