Etela Rajender: కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై బీజేపీ నేతలు ఒకొక్కరుగా స్పందిస్తున్నారు. ఈ వ్యవహారంపై నోరు విప్పారు ఎంపీ ఈటెల రాజేందర్. సీబీఐ విచారణపై తమకు పూర్తి నమ్మకముందన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు రేవంత్ సర్కార్ ఆదేశించడాన్ని రాజకీయ పార్టీలు స్వాగతిస్తున్నారు. ఇప్పటికే కేంద్రమంత్రి బండి సంజయ్ తొలిగా నోరువిప్పారు. ఇప్పుడు ఆ పార్టీ ఎంపీ ఈటెల రాజేందర్ వంతైంది. దీనిపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పని చేసిందని అంటూనే, పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు తప్పుల తడక అన్నారు. అది నిలవదని వాళ్లకు అర్థమయ్యిందని, దాన్ని ఓన్ చేసుకోవడానికి ఈ పని చేశారన్నారు. సీబీఐ విచారణపై తమకు సంపూర్ణ విశ్వాసం ఉందన్న ఆయన, జరిగిన అక్రమాలు బయటకు రావడం ఖాయమన్నారు.
కమిషన్ తన నివేదికలో ఆనాటి ఆర్థికమంత్రి ఈటెల పేరు ప్రస్తావించింది. తొలుత కేసీఆర్, ఆ తర్వాత హరీష్‌రావు, చివరకు ఈటెల పేరును ప్రస్తావించింది. తాను ఎలాంటి అవినీతికి పాల్పడ లేదని కమిషన్ ముందు హాజరైన సందర్భంలో ఆయన చెప్పుకొచ్చారు. కాలేశ్వరం అవినీతి వ్యవహారంలో బీజేపీ నేతలు సైతం రియాక్టు అవుతున్నారు.
ALSO READ: ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ.. కాళేశ్వరం వ్యవహారంపై చర్చ
పీసీ ఘోష్ కమిషన్ ముందుకు జూన్ ఆరున ఎంపీ ఈటెల రాజేందర్ హాజరయ్యారు. దాదాపు 19 ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. ప్రాజెక్టు నిర్మాణం, ఆర్థిక వ్యవహారాలు, నిధుల సమీకరణ వాటిపై కమిషన్‌కు వివరించారు. తుమ్మిడిహట్టి నుండి మేడిగడ్డకు ప్రాజెక్టు మార్చడాన్ని సాంకేతిక కమిటీ నివేదిక ఆధారంగా తీసుకున్నట్లు వెల్లడించారు.
సీడబ్ల్యూసీ నివేదిక ప్రకారం తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేకపోవడం, మహారాష్ట్ర అభ్యంతరం తెలిపిందని వివరించారు. నిధుల కొరతను దృష్టిలో పెట్టుకున్న ఆనాటి ప్రభుత్వం కాలేశ్వరం కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిందన్నారు.
వాటి ద్వారా నిధులను సమీకరించేందుకు ప్రయత్నం చేశామని, నిధుల సేకరణ జరగలేదు. ఫైనాన్స్ శాఖకు సంబంధం లేకుండా నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో జరిగిందని ఈటెల చెప్పుకొచ్చిన విషయం తెల్సిందే. మరి సీబీఐ విచారణలో ఆయన పాత్ర ఏంటన్నది కూడా తేలనుంది.
కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించడంపై ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు
పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు తప్పుల తడక అని.. అది నిలవదని తెలిపిన ఎంపీ ఈటెల pic.twitter.com/obINn9oOuH
— BIG TV Breaking News (@bigtvtelugu) September 1, 2025