BigTV English

Brain SuperComputer: మనిషి మెదడు లాంటి సూపర్ కంప్యూటర్.. చైనా అద్భుత సృష్టి

Brain SuperComputer: మనిషి మెదడు లాంటి సూపర్ కంప్యూటర్.. చైనా అద్భుత సృష్టి

China Brain SuperComputer Darwin Monkey| చైనా శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన సాంకేతిక విజయాన్ని సాధించారు. చైనాలోని జెజియాంగ్ యూనివర్సిటీలోని శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అతిపెద్ద న్యూరోమార్ఫిక్ (అంటే మనిషి మెదడును పోలిన) సూపర్ కంప్యూటర్‌ను తయారు చేశారు. దీనిని “డార్విన్ మంకీ” అని పేరు పెట్టారు. ఈ సూపర్ కంప్యూటర్ మానవ మెదడు పనితీరును అనుకరిస్తుంది. ఇది కృత్రిమ మేధస్సు (AI)ని మరింత అభివృద్ధి చేసేందుకు సహాయపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.


డార్విన్ మంకీలో 200 కోట్ల కృత్రిమ న్యూరాన్లు ఉన్నాయి అంటే మానవ మెదడు లాంటి శక్తి లాంటిది. అలాగే, 10,000 కోట్ల సినాప్స్‌లు కూడా ఉన్నాయి. ఈ న్యూరాన్లు, సినాప్స్‌లు మానవుని ఆలోచనలను అనుకరించేలా చేస్తాయి. ఈ కంప్యూటర్ ఒకే ఆపరేషన్‌తో సంక్లిష్టమైన పనులను చేయగలదు. కంటెంట్ రూపొందించడం, ఆలోచనలను పరిష్కరించడం వంటి పనులను సులభంగా చేస్తుంది. ఈ నూతన టెక్నాలజీ AIని ఇంకా తెలివైనదిగా మారుస్తుంది.

విద్యుత్ ఆదా చేసే సాంకేతికత
ఈ సూపర్ కంప్యూటర్ కేవలం 2000 వాట్ల విద్యుత్‌ను మాత్రమే వినియోగిస్తుంది. ఇంత శక్తిమంతమైన యంత్రానికి ఇది చాలా తక్కువ. ఇతర పాత సూపర్ కంప్యూటర్‌లకు ఇలాంటి పనుల కోసం ఎక్కువ విద్యుత్‌ వినియోగించాల్సి వస్తుంది. క్కువ విద్యుత్‌తో ఎక్కువ పని చేయడం వల్ల డార్విన్ మంకీ అత్యంత సమర్థవంతమైన యంత్రంగా నిలుస్తుంది.


అధునాతన చిప్ టెక్నాలజీ
జెజియాంగ్ యూనివర్సిటీ, జెజియాంగ్ ల్యాబ్ కలిసి 960 డార్విన్ 3 చిప్‌లను తయారు చేశాయి. ఒక్కో చిప్ సగటున 23.5 లక్షల న్యూరాన్లను ప్రాసెస్ చేస్తుంది. ఈ చిప్‌లు మానవ మెదడు లాంటి కమ్యూనికేషన్ నమూనాలను అనుసరిస్తాయి. ఈ ప్రాజెక్ట్‌కు అలీబాబా గ్రూప్ నిధులు సమకూర్చింది.

AI, న్యూరోసైన్స్‌లో పురోగతి

డార్విన్ మంకీ కృత్రిమ సామాన్య మేధస్సు (AGI)లో గొప్ప పురోగతిని సాధించింది. ఆలోచన, సమస్య పరిష్కారం వంటి AI సవాళ్లు ఎదుర్కోవడంలో ఇది ముందంజలో ఉంది. ఈ సూపర్ కంప్యూటర్ మానవ, జంతు మెదడులను, అలాగే జీబ్రాఫిష్, మకాక్ మెదడులను అనుకరిస్తుంది. ఇది న్యూరోసైన్స్ పరిశోధనకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

గత ప్రాజెక్టుల నుండి పరిణామంచైనా 2020లో డార్విన్ మౌస్ అనే సూపర్ కంప్యూటర్‌ను తయారు చేసింది. అందులో 12 కోట్ల న్యూరాన్లు ఉండేవి. డార్విన్ మంకీ దాని కంటే 17 రెట్లు ఎక్కువ న్యూరాన్లతో మరింత అధునాతనంగా ఉంది. ఇది చైనా సాంకేతిక పురోగతిని చూపిస్తుంది.

స్మార్ట్ టెక్నాలజీ యంత్రాలు తయారు చేయడంలో ఉపయోగకరం
డార్విన్ మంకీ తెలివైన యంత్రాలను మరింత అభివృద్ధి చేస్తుంది. ఇది గణిత సమస్యలను త్వరగా పరిష్కరిస్తుంది. కంటెంట్‌ను వేగంగా రూపొందిస్తుంది. దీని వల్ల చైనా.. AI రంగంలో గ్లోబల్ లీడర్ గా ఎదిగే అవకాశాలున్నాయి.

ప్రపంచ టెక్నాలజీపై దీని ప్రభావం ఎలా ఉంటుంది?

ఇప్పటివరకు ఉన్న అత్యంత వేగ వంతమైన సూపర్ కంప్యూటర్.. ఇంటెల్ హాలా పాయింట్ (115 కోట్ల న్యూరాన్లు) కంటే డార్విన్ మంకీ రెండు రెట్లు ఎక్కువ న్యూరాన్లతో న్యూరోమార్ఫిక్ రంగంలో ముందంజలో ఉంది. ఈ విజయం సాధించడంలో AI రంగంలో చైనా మరిన్ని పెట్టుబడులతో భవిష్యత్తు ప్రాజెక్ట్స్ రూపొందిస్తున్నట్లు తెలిసింది.

డార్విన్ మంకీ రోబోటిక్స్, వైద్య పరిశోధనలలో యంత్రాల సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇది మానవ మెదడు లాంటి డేటా ప్రాసెసింగ్‌తో వేగం మరియు సమర్థతను అందిస్తుంది. ఇంటెలిజెంట్ సిస్టమ్స్ భవిష్యత్తుకు డార్విన్ మంకీ సక్సెస్ ఒక మైలు రాయి.

Also Read: ఏఐతో పోటీపడే చిచ్చరపిడుగులు.. తెలివైన పిల్లలు పుట్టేందుకు గర్భంలోనే ఇంజినీరింగ్

Related News

Call Transcribe Pixel: పాత పిక్సెల్ ఫోన్‌లలో కొత్త ఫీచర్.. కాల్ ట్రాన్స్‌క్రైబ్.. ఎలా చేయాలంటే?

Pixel 10 Pro Alternatives: పిక్సెల్ 10 ప్రో కంటే బెటర్? టాప్ కెమెరా ఫోన్లు ఇవే..

AI Security Robots: సెక్యూరిటీ రోబోలు.. ఇండియాలో వచ్చేస్తున్నాయ్.. మీరు కొనుగోలు చేస్తారా?

iPhone 17 Series: ఐఫోన్ 17 సిరీస్ వచ్చేస్తోంది.. ఇక ఈ 6 ఆపిల్ ప్రొడక్స్ కనిపించవా?

iphone 17 Price: ఐఫోన్ 17 సిరీస్ త్వరలోనే లాంచ్.. ఇండియాలో ధరలు ఇవే

Big Stories

×