BigTV English

Bhatti Strong Counter to KCR: కేసీఆర్ వ్యాఖ్యలపై భట్టి కౌంటర్

Bhatti Strong Counter to KCR: కేసీఆర్ వ్యాఖ్యలపై భట్టి కౌంటర్

Bhatti Vikramarka Counter to KCR: బడ్జెట్ పద్దుపై మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సంక్షేమం.. అభివృద్ధిని సమానంగా చూశాం. రెవెన్యూ వచ్చే శాఖలపై ప్రతి శుక్రవారం సమీక్ష చేస్తున్నాం. దళిత బంధుకు గత ప్రభుత్వం రూ. 7 వేల కోట్లు కేటాయించి.. ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. ఇప్పుడేమో ఆ ప్రస్తావనే లేదని కేసీఆర్ చెబుతున్నారు. భవిష్యత్‌లో కేసీఆర్ మేం చేసేది చూస్తారు. రుణమాఫీకి డబ్బులు ఎక్కడివి అన్నారు.. కానీ మేం చేసి చూపిస్తున్నాం’ అంటూ కేసీఆర్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.


కేంద్ర నుంచి హక్కుగా రావాల్సిన నిధుల కోసం అసెంబ్లీలో పెట్టిన చర్చకు ఆయన హడావిడిగా వస్తే బాగుండేదన్నారు. బడ్జెట్ ప్రసంగాన్ని పూర్తిగా వెంటే కేసీఆర్ కు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో అరమయ్యేదంటూ మండిపడ్డారు. కేసీఆర్ కు రెస్ట్ తీసుకోమని ప్రజలు సమయం ఇచ్చారన్నారు. కానీ, కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులు చెబితే అసెంబ్లీకి వచ్చి హడావుడి చేసి బయటకు వెళ్లిపోయారంటూ విమర్శించారు.

Also Read: కేసీఆర్ చీల్చి చెండాడితే మేం చూస్తూ ఊరుకోం: మంత్రి పొన్నం


దళితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన కేసీఆర్ ఈ బడ్జెట్ లో దళిత బంధు ప్రస్తావించలేదని మాట్లాడుతుంటే నవ్వాలా? ఏడ్వాలో? అర్థం కావటంలేదన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా తాము ఎస్సీఎస్టీ సబ్ ప్లాన్ నిధులను మేం డైవర్ట్ చేయమన్నారు. ఆ నిధులను పూర్తి స్థాయిలో వారి కోసమే ఖర్చుపెడుతామన్నారు. హైదరాబాద్ మౌలిక వసతుల కల్పన కోసం ఎన్నడూ లేని విధంగా ఈ బడ్జెట్ లో రూ. 10 వేల కోట్లను కేటాయించామన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నదన్నారు. రాష్ట్ర అభివృద్ధికి మణిహారంగా ఉన్న హైదరాబాద్ ను అభివృద్ధి చేయడం అత్యంత ప్రాధాన్యత కూడిన అంశంగా ఆయన అభివర్ణించారు.

Tags

Related News

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Guvvala Balaraju: బీజేపీలో చేరిన గువ్వల.. కేటీఆర్‌పై హాట్ కామెంట్స్..

Big Stories

×