E-Paper
Advertisement

BIGTV Free Medical Camp: బిగ్ టీవీ మెగా మెడికల్ క్యాంప్.. మమతా హాస్పిటల్‌లో ఫ్రీగా మోకాళ్ల, కంటి ఆపరేషన్

BIGTV Free Medical Camp: బిగ్ టీవీ మెగా మెడికల్ క్యాంప్.. మమతా హాస్పిటల్‌లో ఫ్రీగా మోకాళ్ల, కంటి ఆపరేషన్
Advertisement

ఈ మెగా మెడికల్ క్యాంప్‌కు కాలనీతో పాటు సమీప ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. అనుభవజ్ఞులైన వైద్యులు సాధారణ ఆరోగ్య పరీక్షలతో పాటు కంటి, మోకాళ్ల వంటి సమస్యలపై ప్రత్యేకంగా పరిశీలనలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు కూడా అందజేశారు.

Advertisement

ఈ క్యాంప్‌లో నిర్వహించిన పరీక్షల్లో మొత్తం 21 మందికి శస్త్రచికిత్స అవసరం ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. వీరిలో కొందరికి కంటి సమస్యలు ఉండగా, మరికొందరికి మోకాళ్ల సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇప్పటివరకు చికిత్స చేయించుకోలేకపోయిన ఈ రోగులకు, మమతా ఆసుపత్రి యాజమాన్యం పూర్తిస్థాయిలో సహకారం అందించింది.

వైద్యుల సూచనల మేరకు శస్త్రచికిత్స అవసరమైన 21 మందిని ప్రత్యేక వాహనాల్లో.. మమతా ఆసుపత్రికి తరలించారు. అక్కడ అన్ని రకాల వైద్య పరీక్షలు పూర్తి చేసి, అవసరమైన విధంగా కంటి ఆపరేషన్లు, మోకాళ్ల ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించారు. ఆధునిక వైద్య సదుపాయాలు, అనుభవజ్ఞులైన సర్జన్ల పర్యవేక్షణలో ఈ ఆపరేషన్లు జరగడంతో.. రోగులు త్వరగా కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు.

Advertisement

ఆపరేషన్ల అనంతరం రోగులకు అవసరమైన, మందులు, ఆహారాన్ని ఆసుపత్రి వర్గాలు అందించాయి. పూర్తిగా కోలుకున్న తర్వాత, వారిని సురక్షితంగా తిరిగి వారి ఇళ్ల వద్దకు చేరవేశారు. ఆసుపత్రి నుంచి ఇంటి వరకు రవాణా ఏర్పాట్లు కూడా మమతా ఆసుపత్రి, బిగ్ టీవీ నిర్వాహకులే చూసుకున్నారు. ఈ సేవలన్నీ ఉచితంగానే అందించడం విశేషంగా నిలిచింది.

స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీ పెద్దలు ఈ కార్యక్రమాన్ని అభినందించారు. ఇటువంటి మెగా మెడికల్ క్యాంప్‌లు మరిన్ని ప్రాంతాల్లో నిర్వహించాలని వారు కోరారు.

Also Read: బిగ్ టీవీ మెగా మెడికల్ క్యాంప్.. నలుగురికి ఉచిత కంటి ఆపరేషన్లు

నిజం కావాలా.. భజన కావాలా అనే నినాదంతో మీడియా రంగంలోనికి ప్రవేశించిన బిగ్ టీవి.. తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆదరణ పొందుతుంది. నిఖార్సైన వార్తలను అద్భుతంగా ప్రజలకు అందిచడంతో పాటు.. జనాలను చైతన్యపరుస్తూ.. పేదల పక్షంగా నిలుస్తోంది. సంపాదనే ధ్యేయంగా.. వ్యవస్థలు నడుస్తున్న సమయంలో బిగ్ టీవీ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అందర్నీ ఆశ్యర్యానికి గురిచేస్తుంది. ఎందుకంటే.. పేద ప్రజలు ఉన్న చోటే క్యాంపులు ఏర్పాటు చేసి.. వారి వద్దకే వెళ్లి.. టెస్ట్‌లు నిర్వహించడం, వారికి శస్త్ర చికిత్సలు చేయిస్తూ.. పేదలకు భరోసా ఇస్తోంది బిగ్ టీవి.

Related News

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

Big Stories

Advertisement
×