BigTV English

BJP: బీజేపీలోకి ఆ ముగ్గురు.. ఆ మూడు ప్రాంతాల్లో పట్టు.. కేసీఆర్‌కు కౌంట్‌డౌన్ షురూ..

BJP: బీజేపీలోకి ఆ ముగ్గురు.. ఆ మూడు ప్రాంతాల్లో పట్టు.. కేసీఆర్‌కు కౌంట్‌డౌన్ షురూ..
telangana bjp

BJP News Telangana: కొంతకాలంగా తెలంగాణ బీజేపీ కాస్త డల్‌గా ఉంది. పార్టీలో చేరికలు లేవ్. మునుగోడు ఎన్నికల సమయంలో బూర నర్సయ్య గౌడ్‌కు కాషాయ కండువా కప్పేసి కాస్త హడావుడి చేసింది. ఆ తర్వాత స్వామి గౌడ్, బిక్షమయ్య గౌడ్, శ్రావణ్‌లతో బీఆర్ఎస్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్‌తో కమలనాథులకు మైండ్ బ్లాంక్ అయింది. బీజేపీలో కేసీఆర్‌కు కోవర్టులు ఉన్నారంటూ అప్పట్లో ఈటల కామెంట్ చేయడం పార్టీలో ప్రకంపణలు రేపింది.


కట్ చేస్తే.. బీజేపీ మళ్లీ దూకుడు పెంచింది. కవిత ఈడీ విచారణతో కమలంలో జోష్ పెరిగింది. టెన్త్ పేపర్ లీకేజీ అంటూ బండి సంజయ్‌ను అరెస్ట్ చేయడంపై రగిలిపోతోంది. కేసీఆర్‌కు గట్టి షాక్ ఇవ్వాలని గట్టిగానే డిసైడ్ అయినట్టుంది. చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ ఆపరేషన్ ఆకర్ష్ షురూ చేశారు. ఇద్దరు బీఆర్ఎస్ నేతలకు, ఓ కాంగ్రెస్ కీలక లీడర్‌తో టచ్ లోకి వచ్చింది బీజేపీ.

ఆ ఇద్దరు బీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరడం ఖాయమని తెలిసిన గులాబీ బాస్.. ఉన్నట్టుండి వారిపై బహిష్కరణ వేటు వేశారు. ఖమ్మం జిల్లాకు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు రేపోమాపో బీజేపీలో చేరుతారని అంటున్నారు.


అనూహ్యంగా ఆదిలాబాద్‌కు చెందిన బలమైన కాంగ్రెస్ లీడర్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డికి సైతం వల విసిరింది బీజేపీ. ఆయన సైతం కాషాయ వలకు చిక్కారు. ఆ విషయం తెలిసే కాంగ్రెస్ పార్టీ ఏలేటికి షోకాజ్ నోటీసులు ఇచ్చి గంటలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కట్ చేస్తే, ఖర్గేతో మాట్లాడుతానంటూ ఢిల్లీ వెళ్లిన మహేశ్వర్‌రెడ్డి.. నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకుని కమల శిబిరంలో కలిసిపోయాడు. ఏఐసీసీ స్థాయి నేతైన ఏలేటిని బీజేపీలో చేర్చుకోవడం కాంగ్రెస్‌కు బిగ్ షాకే.

ఆ ముగ్గురినీ డీల్ చేసింది ఈటల రాజేందర్, బండి సంజయ్‌లే. రెండు రోజులుగా ఢిల్లీలో మకాం వేసి అధిష్టానంతో ఫైనల్ టాక్స్ జరిపారు. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో మొదటి ఏలేటి మహేశ్వర్‌రెడ్డిని పార్టీలో చేర్చేసుకున్నారు. రేపోమాపో పొంగులేటి, జూపల్లిలకు కండువాలు కప్పే కార్యక్రమం ఉంటుందని తెలుస్తోంది.

ముగ్గురూ ముగ్గురే. పొంగులేటి బీజేపీలో చేరితే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలహీనంగా ఉన్న బీజేపీకి బిగ్ బూస్ట్ వచ్చినట్టే. పాత పాలమూరు జిల్లాల్లో జూపల్లి స్ట్రాంగ్ లీడర్. డీకే అరుణకు జూపల్లి కూడా తోడైతే.. కమలం పార్టీకి అదనపు బలమే. ఇక ఉమ్మడి ఆదిలాబాద్‌ నుంచి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి లాంటి లీడర్ బీజేపీలో జాయిన్ కావడం వెయ్యి ఏనుగుల బలం. ఇప్పటికే ఆ ప్రాంతంలో సత్తా చాటుతున్న కాషాయదళానికి మంచి నాయకుడు లభించినట్టే. ఇలా మూడు ప్రాంతాల్లోని మూడు ఉమ్మడి జిల్లాలకు చెందిన కీలక నేతలను చేర్చుకుని.. తెలంగాణలో బీజేపీని తిరుగులేని పార్టీగా నిలబెట్టాలనేది బీజేపీ వ్యూహం. ఈ ఆపరేషన్ ఆకర్ష్‌ను ఈటల రాజేందర్ అమలు చేయగా.. బండి సంజయ్ పర్యవేక్షించారు. వీరిద్దరి దూకుడుతో.. త్వరలోనే ఆ ముగ్గురి చేరికతో.. కమలం పార్టీ ఫుల్ ఖుషీ.

Related News

Bagram Air Base: బాగ్రామ్ ఎయిర్ బేస్ ఇచ్చేయండి.. లేదంటే రక్తపాతమే..

US Army in Bangladesh: బంగ్లాలో సీక్రెట్ మిషన్..! రంగంలోకి యూఎస్ ఆర్మీ..

Amit Shah: మావోయిస్టుల రూట్ చేంజ్! కొత్త వ్యూహం ఇదేనా?

Telangana Sports: టార్గెట్ 2036 ఒలింపిక్స్..! గోల్డ్ తెచ్చిన వారికి రూ.6 కోట్ల నజరానా

Telangana BJP MP’s: మారకపోతే అంతే.. బీజేపీ ఎంపీలకు ఢిల్లీ పెద్దల వార్నింగ్

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌పై.. వైసీపీ పొలిటికల్ గేమ్

Kakinada: కాకినాడ రూరల్ సెగ్మెంట్‌పై ఫోకస్ పెట్టని టీడీపీ పెద్దలు

Hyderabad Metro: మెట్రో ప్లాన్..! అప్పుల నుంచి బయటపడాలంటే ఇదొక్కటే మార్గం..!

Big Stories

×